ముంబై: ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ (పీఈలు) 2021లో పెద్ద ఎత్తున స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశాయి. 35 బిలియన్ డాలర్లను (రూ.2.62లక్షల కోట్లు) కుమ్మరించాయి. ఇతర సంస్థల్లోనూ కలిపి చూస్తే 2021లో పీఈ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి 66.1 బిలియన్ డాలర్లు (రూ.4.95 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. మొత్తం మీద 2021లో 2,064 లావాదేవీలు జరిగాయి. 114.9 బిలియన్ డాలర్లు (రూ.8.62 లక్షల కోట్లు) వచ్చాయి. విలువ పరంగా 2020తో పోల్చి చూస్తే 40 శాతం ఎక్కువ. పీడబ్ల్యూసీ ఇండియా ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.
లావాదేవీల వివరాలు..
► 2021లో పీఈ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 66.1 బిలియన్ డాలర్లతో 1,258 లావాదేవీలు జరిగాయి. 2020లో నమోదైన లావాదేవీలతో పోలిస్తే 32 శాతం అధికం.
► 43 స్టార్టప్‌లు యూనికార్న్‌లు మారాయి.
► స్టార్టప్‌లు 1,000కు పైగా విడతల్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నాయి.
► విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు (ఎంఅండ్‌ఏ) రెట్టింపయ్యాయి. 2020తో పోలిస్తే విలువ పరంగా 28 శాతం వృద్ధి నమోదైంది.
► టెక్నాలజీ కంపెనీలు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 823 లావాదేవీలు నమోదయ్యాయి.
► 2022లో పెట్టుబడుల జోరు కొనసాగుతుందని పీడబ్ల్యూసీ అంచనా.
ఆల్‌టైమ్ రికార్డ్, గతేడాది రూ.4.95లక్షల కోట్లకు చేరిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్!
Published Sat, Feb 12 2022 7:10 AM | Last Updated on Sat, Feb 12 2022 7:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment