ఖాట్మండు: భారత్‌తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత ముందుకు తీసుకువెళుతోంది. మన దేశ భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించిన ఒక్క రోజు తర్వాత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
భారత్ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను నేపాల్ విడుదలచేయడం తెల్సిందే. ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు. చదవండి: సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన
Comments
Please login to add a commentAdd a comment