సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ‍్జెట్‌లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్‌లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు.
సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?
Comments
Please login to add a commentAdd a comment