vijaisai reddy
-
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
సినిమా అంటే హీరో ఒక్కడే కాదు: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? -
EPF వడ్డీ రేట్లు తగ్గించడం సరికాదు :విజయసాయిరెడ్డి
-
ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఆర్బీఐ
-
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన
-
మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తాము : విజయసాయిరెడ్డి
-
బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరిన పోలీసులు
విజయనగరం: రామతీర్థంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులకు బెయిల్ లభిస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్ధం సందర్శన సందర్భంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనంపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలో నెలిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత కళా వెంకటరావును అరెస్ట్ చేసి ఆతర్వాత విడుదల చేశారు. ఇదే కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకటరావు ఉన్నారు. -
కౌంటింగ్ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చాం
-
తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకూ..
సాక్షి, విజయవాడ : తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌లో గురువారం వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సాఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ సీఎస్ అజయ్ కల్లాం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల విధులు, బాధ్యతల గురించి ట్రైనింగ్ ఇచ్చామాన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సహా మొత్తం 400 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఏజెంట్లు, రిజర్వ్ ఏజెంట్లు ఎంత మంది ఉండాలి.. వారికి ఉండాల్సిన అర్హతల గురించి వివరించామన్నారు. రౌండ్స్ వారిగా తీసుకోవాల్సిన చర్యలు.. రీకౌంటింగ్ ఏ సందర్భంలో కోరవచ్చో తెలియజేశామన్నారు. ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్ నిలుపుదల చేస్తే.. తక్షణమే రీకౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం పని చేస్తుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పామన్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లిన తరువాత ఫోన్లు వాడకూడదని సూచించమన్నారు. ఎన్నికల కమిషన్ ప్రింట్ చేసి ఇచ్చిన మాన్యువల్ కూడా అందరికీ ఒక కాపీ అందజేశామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కౌంటింగ్ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చాం -
ఏబీఎన్ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు
-
ఏబీఎన్ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. తన వాయిస్‌ని డబ్బింగ్ చేసి తన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏబీఎన్ ఛానల్లో కథనాలు వండివార్చారని ఆరోపించారు. కేసు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో జూబ్లీహిల్స్ పోలీసులు బదలాయించారు. విజయసాయి రెడ్డి తరపున వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ చల్లా మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఛానల్లో టెలికాస్ట్ చేసిన ఆడియో, వీడియో, డిబేట్ వీడియోలను సాక్ష్యాలుగా ఫిర్యాదుదారుడు పొందుపరిచారు. రాధాకృష్ణతో పాటు దీని వెనక చంద్రబాబు కుట్ర దాగి ఉందని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
డేటా చోరీ.. దేశంలోనే పెద్ద సాబోటేజ్ క్రైమ్
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ స్కాం అనేది దేశంలోనే అతి పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమ్ అని వర్ణించారు. రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని బజారులో పడేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇంకా ఏయే వ్యవస్థల్లోకి టీడీపీ ప్రభుత్వం చొరబడిందో తేల్చాల్సి ఉందన్నారు. దొంగిలించిన సమాచారంతో ఏపీ ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బాబు నాశనం చేశాడని ఆరోపించారు. తండ్రీకుమారులు చేసిన డేటా బ్రీచ్ సాధారణ నేరం కాదని వ్యాఖ్యానించారు. ఓట్ల తొలగింపు ద్వారా ఏపీలో విజయం సాధించి ఉంటే భవిష్యత్తులో తమ చెంచాను దేశ ప్రధానిగా చేసుకునే కుట్రకు పాల్పడేవారేనని అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలను రష్యా మ్యానిపులేట్ చేసిందనే వార్తలే చంద్రబాబుకు ప్రేరణ కలిగించి ఉండవచ్చునని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ పోరాటం వదిలి చంద్రబాబు, ప్రజలపై కసి తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు.. ఇప్పుడు ప్రజల డేటాను దొంగిలించి వారి సర్వస్వం దోచుకునే ప్లాన్ వేశాడని ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి గెలుపుపైనా అనుమానం కలుగుతోందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పోటీ చేసేందుకూ అభ్యర్థులూ కష్టమే! నోటిఫికేషన్ వెలువడక ముందే టీడీపీ నాయకత్వం ఓటమిని ఓప్పేసుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా వైఎస్సార్ కాంగ్రెస్ నవరత్నాలను కాపీ కొట్టి ప్రజలను ఏమార్చవచ్చని చూశారు... ఎవరూ నమ్మకపోయేసరికి దొంగదారులు వెతుకుతున్నారని విమర్శించారు. -
చంద్రబాబుది గోబెల్స్ ప్రచారం
-
'200 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు'.
-
'200 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు'
అనంతపురం: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 200 హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. లక్షా 30 వేల కోట్ల రూపాయల రుణాలుంటే ప్రభుత్వం కేవలం రూ. 5 వేల కోట్లు కేటాయించడం సమంజసమా అని ప్రశ్నించారు. రుణమాఫీ త్వరగా జరగాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని అన్నారు. నవంబర్ 5న నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో అన్నివిధాలా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. -
చంద్రబాబూ.. పాలనపై దృష్టి పెట్టు: ఉమ్మారెడ్డి
కడప: పార్టీలు మారుతున్నారంటూ ప్రచారం చేయిస్తున్న సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయడం మంచి సాంప్రదాయం కాదని, దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశంలో విజయసాయిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు 'మనసులో మాట'ను గమనిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచన లేదని అర్థమవుతుందన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్లలోనే రూ. 51 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని, సముచిత స్థానం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీయిచ్చారు.