ఏబీఎన్‌ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు | YSRCP MP Vijayasai Reddy Complains Against ABN Andhra Jyothy MD Radha Krishna In Hyderabad | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

Published Sun, Apr 7 2019 7:42 PM | Last Updated on Sun, Apr 7 2019 8:58 PM

YSRCP MP Vijayasai Reddy Complains Against ABN Andhra Jyothy MD Radha Krishna In Hyderabad - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(పాత చిత్రం)

హైదరాబాద్‌: ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్‌ సెక్రటరీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. తన వాయిస్‌ని డబ్బింగ్‌ చేసి తన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏబీఎన్‌ ఛానల్‌లో కథనాలు వండివార్చారని ఆరోపించారు. కేసు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుండటంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు బదలాయించారు.

విజయసాయి రెడ్డి తరపున వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఛానల్‌లో టెలికాస్ట్‌ చేసిన ఆడియో, వీడియో, డిబేట్‌ వీడియోలను సాక్ష్యాలుగా ఫిర్యాదుదారుడు పొందుపరిచారు. రాధాకృష్ణతో పాటు దీని వెనక చంద్రబాబు కుట్ర దాగి ఉందని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement