సాక్షి, హైదరాబాద్: ఐటీడీఏ(సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఐటీడీఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. దాదాపు 25 ఏళ్లుగా ఐటీడీఏల్లో పనిచేస్తున్నప్పటికీ అరకొర వేతనాలు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల విడుదలలో జాప్యం చేయడంతో సిబ్బందికి నెలవారీ వేతనాలు అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు కాంట్రాక్టు సిబ్బంది సోమవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్‌ను కలసి వినతిపత్రం అందించారు. సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment