కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి
Published Wed, Dec 14 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
– ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా
కర్నూలు సిటీ: జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్, పీడీయస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థాని ఇంటర్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయం అధికారి కార్యాయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, శేఖర్ నాయుడు, భాస్కర్, ఆనంద్, రాజ్‌కూమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, ఇవ్వలేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీల గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా కార్పొరేట్ కాలేజీలతో సమానంగా ఫలితాలు తీసుకువస్తున్నారనే విషయం గుర్తించాలన్నారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పేదలకు అందనంత దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. అనంతర డీవీఈఓ సుబ్రమణ్యేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement