
సాక్షి, హైదరాబాద్ : వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడవుతాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. జులై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో 46ను అమలు చేస్తామన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈనెల 25 నుంచి టీచర్లు స్కూళ్లకు రావాలని ఆదేశించారు.