సాక్షి ముంబై: రాష్టవ్య్రాప్తంగా 10, 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ పరీక్షా ఫామ్‌ను ఆన్‌లైన్‌లో నింపే సౌకర్యం కల్పించాలని మహారాష్ట్ర స్టేట్ బోర్‌ట ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎంఎస్‌బీఎస్‌హెచ్‌ఎస్‌ఈ) నిర్ణయించింది. 12వ తరగతికి ఫిబ్రవరి-మార్చి 2014 లో, టెన్‌తకు గాను సెప్టెంబర్-అక్టోబర్ 2014లో ఈ ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పుణే, ముంబై, నాసిక్, అమరావతి, నాగ్‌పూర్, సంభాజీనగర్, కొల్హా„పూర్, కొంకణ్, లాతూర్ విభాగాల్లోని 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షా ఫామ్ నింపుతారు.
ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ప్రతి విభాగంలో బోర్డుకు వేర్వేరు సర్వర్లు అందజేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫామ్ నింపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బోర్డు ముంబై విభాగం అధ్యక్షుడు లకీష్మకాంత్ పాండే మాట్లాడుతూ... ఆన్‌లైన్‌లో పరీక్షా ఫామ్ నింపడంలో పొరపాటు జరిగితే దరఖాస్తు చేయడం కుదరదని స్పష్టం చేశారు. 12వ తరగతి పరీక్షల కోసం అక్టోబర్ 20 నుంచి ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తారని తెలిపారు.
నగరంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. గడువులోపే ఫామ్ నింపడం ప్రారంభించాలని, దీంతో సర్వర్‌పై భారం పడబోదని ఆయన సూచించారు. ఇంటర్‌నెట్‌లో ఝ్చజ్చిజిటటఛిఛౌ్చటఛీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పరీక్షా ఫామ్‌ను నింపవచ్చు. కాగా దరఖాస్తును కేవలం పాఠశాల, జూనియర్ కళాశాలలోనే నింపాలి. పాఠశాల, జూనియర్ కళాశాలలకు వేర్వేరు లాగ్ ఇన్ ఐడీ, పాస్‌వర్‌డ ఇచ్చారు. హాల్ టికెట్ కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేయాలని బోర్టు యోచిస్తోంది. ప్రైవేట్‌గా పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఫామ్ నింపడానికి ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. పరీక్షా ఫామ్‌పై విద్యార్థి ఫొటో, సంతకం స్కాన్ చేసి ఇస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తు...
ఇంటర్నెట్ సౌకర్యం లేనివారి కోసం ఒక సీడీ అందజేస్తారు. ఈ సీడీలోని సాఫ్‌టవేర్ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత విద్యార్థుల పరీక్షా ఫారాలను ఆఫ్‌లైన్‌లో భర్తీ చేసి, ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నింపవచ్చు.
10,12 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సౌకర్యం
Published Tue, Oct 8 2013 11:55 PM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement