కత్రినాకు ఐపీఎల్‌ ఆఫర్‌..! | Katrina Kaif Playing Cricket At bharath Shooting Spot | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 22 2019 3:26 PM | Last Updated on Tue, Jan 22 2019 3:39 PM

Katrina Kaif Playing Cricket At bharath Shooting Spot - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న ఈ  చిత్రంలో కత్రినా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌లో కాస్త విరామం దొరికిన సమయంలో చిత్రబృందం క్రికెట్‌ ఆడారు. అందులో కత్రినా తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. షూటింగ్‌ పూర్తైన తరువాత సరదాగా క్రికెట్‌ ఆడినట్లు.. వరల్డ్‌ కప్‌ దగ్గరపడుతుండటంతో భారత సారథికి తన గురించి కొంచెం చెప్పమని అనుష్క శర్మను కోరారు. మొత్తానికి తానొక బ్యాడ్‌ ఆల్‌రౌండర్‌ను కాదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసిన ప్రీతిజింటా.. ఐపీఎల్‌కు కత్రినాను తన టీమ్‌లోకి తీసుకుంటామని సరదాగా కామెంట్‌ చేశారు. దీనికి బదులుగా.. దయచేసి నన్ను తీసుకోండి.. నన్ను ఆడనివ్వండి అంటూ కత్రినా ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఈ వీడియో బ్యాగ్రౌండ్‌లో గల్లీ భాయ్‌​ సాంగ్‌ ప్లే అవుతుండగా.. కత్రినా రెచ్చిపోయి బౌండరీల మీద బౌండరీలు కొట్టేశారు. మొత్తానికి కత్రినా భారత్‌, గల్లీ భాయ్‌, వరల్డ్‌ కప్‌కు తన స్టైల్లో ప్రమోషన్‌ కల్పిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement