స్వచ్ఛభారత్ లక్ష్యంగా ‘మల్లిగాడి మరుగుదొడ్డి’
స్వచ్ఛభారత్ లక్ష్యంగా ‘మల్లిగాడి మరుగుదొడ్డి’
Published Fri, Mar 17 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
–పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్వశిక్షాభియాన్
-జిల్లాలో 46,516 మంది ఆరో తరగతి విద్యార్థులకు అందజేత
భానుగుడి(కాకినాడ) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాని పాఠశాలల్లో ఆరోతరగతి విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్షాభియాన్ ద్వారా కార్టూన్ పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టింది. పరిసరాల పరిశుభ్రతను పాటించాల్సిన ఆవశ్యకతను కార్టూన్‌లద్వారా తెలియపరుస్తూ 50 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఎంత అవసరమో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. దైనందిన కార్యక్రమాలలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకుంటే వచ్చే అనర్థాలను స్పష్టంగా వివరించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలని ఆరోతరగతి చదువుతున్న మల్లిగాడి పాత్ర ద్వారా తెలియజెప్పారు.
‘స్వచ్ఛభారత్’లో భాగంగా ప్రచురణ
అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 46,516 మంది ఆరోతరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో ఈ పుస్తకంపై ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మరో రెండు రోజుల్లో పుస్తకాలన్నీ పాఠశాలలకు చేరతాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
-మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ
విద్యార్థుల ద్వారా అవగాహనే లక్ష్యం
మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచితే సమాజంలోకి సులువుగా విషయం చేరుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పుస్తకాన్ని చదవడానికి వీలుగా, చిన్నచిన్న కొటేషన్ల ద్వారా రూపొందించారు. ప్రతి పాఠశాలకూ పుస్తకాలు చేరేలా చర్యలు తీసుకున్నాం.
-చామంతి నాగేశ్వరరావు, ఏఎంఓ, సర్వశిక్షాభియాన్
Advertisement
Advertisement