కాళిదాస్‌ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ | Bharath Kalidasu First Look Launch | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 19 2018 2:06 PM | Last Updated on Fri, Jan 19 2018 2:06 PM

Bharath Kalidasu First Look Launch - Sakshi

భరత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాళిదాస్‌ టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నటుడు కార్తీ ఆవిష్కరించారు.  కాదల్‌ వంటి ఘన విజయం తరువాత వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ నటుడు భరత్‌ ఇటీవల కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. దీంతో మంచి విజయం కోసం పోరుబాట పట్టిన ఈ యువ హీరో తాజాగా ఒక పవర్‌ఫుల్‌ పాత్రలో కాళిదాస్‌ చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. 

ఈ సినిమాలో ఆయన పోలీస్‌ అధికారిగా నటిస్తుండడం విశేషం. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీసెంథిల్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. థ్రిల్లింగ్‌ కథాంశాన్ని  శ్రీసెంథిల్‌ హ్యాండిల్‌ చేస్తున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. నాళైఇయక్కునార్‌ టీమ్‌కు క్రియేటివ్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన దర్శకుడు శివనేశన్‌ దినకరన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం కాళిదాస్‌. విశాల్‌ చంద్రశేఖరన్‌ సంగీతాన్ని, సురేశ్‌బాల ఛాయాగ్రహణం నిర్వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నటుడు కార్తీ గురువారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పాండిరాజ్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు వేల్‌రాజ్, చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement