కాష్మోరాగా కార్తీ
ఇన్నాళ్లు లవర్ బాయ్గా, మాస్ హీరోగా ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు అన్న సూర్య బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్నకాష్మోరా సినిమాలో నటిస్తున్నాడు కార్తీ. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 60 కోట్లతో పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, శ్రీదివ్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో కార్తీ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా 3డి ఫేస్ స్కానింగ్, 360 డిగ్రీ ఓమ్నీ డైరెక్షనల్ కెమరా టెక్నాలజీస్ను ఈ సినిమా కోసం వినియోగించారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. కార్తీ కాష్మోరా లుక్లో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కాష్మోరా, దీపావళి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది.