మళ్లీ దొరికిపోయింది... | Priyanka Chopra Trying To Hide Her Engagement Ring At Airport | Sakshi
Sakshi News home page

మళ్లీ దొరికిపోయింది...

Published Mon, Aug 6 2018 8:47 PM | Last Updated on Mon, Aug 6 2018 8:53 PM

Priyanka Chopra Trying To Hide Her Engagement Ring At Airport - Sakshi

ప్రియాంక చోప్రా (ఫైల్‌ ఫోటో)

గత కొంతకాలంగా బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అంటే ప్రియాంక చోప్రా - నిక్‌ జోనాస్‌ల నిశ్చితార్ధం గురించే. ఇంతకు వీరికి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా... లేదా అనే విషయం గురించి మాత్రం ఇంతవరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చే సంఘటన ఒకటి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద చోటు చేసుకుంది. గతంలో ఒకసారి మీడియా వారి దృష్టిని తప్పించుకునే ‍క్రమంలో ప్రియాంక, ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌గా ప్రచారం పొందుతున్న ఉంగరాన్ని దాచే ప్రయత్నం చేసి, కెమరాకు దొరికిపోయింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరో సారి చోటు చేసుకుంది.

ఈ నెల 6న(నేడు) జరగబోయే ‘ఫిక్కి’ కార్యక్రమంలో హాజరవ్వడం కోసం ప్రియాంక ఆదివారం రాజధానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు బయట మీడియా వారిని చూసిన ప్రియాంక, వెంటనే తన రింగ్‌ కానీ రింగ్‌, ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో తిప్పేసుకుంది. కానీ ఏం లాభం.. ఈ సారి కూడా కెమరాకు దొరికిపోయింది. దాంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రియాంక, నిక్‌ జోనస్‌లు వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకోసం ప్రియాంక సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు సమాచారం. కారణం ఏదైనా ప్రస్తుతం ప్రియాంక ‘భారత్‌’ చిత్రం నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement