engagement ring
-
Russia-Ukraine war: ప్రేమ యుద్ధం
యుద్ధం దేశాలను ఓడించవచ్చు. ప్రేమను కాదు. ఆమె ఉక్రెయిన్‌లో ఉంది. అతడు ఇండియాలో ఉన్నాడు. ఆమె యుద్ధంలో ఉంది. అతడు ఎదురు చూస్తున్నాడు. ఉక్రెయిన్ జాతీయురాలు అన్నా హొరొడెట్స్కా ఢిల్లీలో ఉండే అనుభవ్ భాసిన్ కోసం ప్రాణాలకు తెగించి వచ్చింది. అతడు ఎయిర్‌పోర్ట్‌లోనే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. అత్తగారు పూలతో స్వాగతం చెప్పింది. ప్రతీకారాలు యుద్ధాలు తెస్తాయి. ప్రేమలు ప్రపంచాన్ని నిర్మిస్తాయి ఈ ప్రేమకథ చెబుతున్నది అదే. యుద్ధంలోనూ ప్రేమలోనూ ఉత్కంఠ తప్పదు. అనుభవ్, అన్నాలది కూడా ఉత్కంఠభరిత ప్రేమ కథే. 29 ఏళ్ల ఉక్రెనియన్ అన్నా హొరొడెట్స్కా తన ప్రేమను సఫలం చేసుకోవడానికి బాంబుల మోతల మధ్య నడిచి ఢిల్లీ చేరింది. ఢిల్లీ హైకోర్టులో లాయర్‌గా పని చేస్తున్న 33 ఏళ్ల అనుభవ్‌ను కలసుకోగలిగింది. ఇక వాళ్ల పెళ్లి జరగడం ఒక లాంఛనం మాత్రమే. ప్రయాణంలో కలిసిన ప్రేమకథ ఉక్రెయిన్‌లో ఐటి ప్రొఫెషనల్‌గా, మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసే అన్నా 2019లో ఇండియా చూడటానికి వచ్చింది. ఆమె ట్రావెల్ చేస్తున్నప్పుడు తనూ ట్రావెల్ చేస్తున్న అనుభవ్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆమె ఉక్రెయిన్ వెళ్లిపోయింది. అయితే వాట్సప్‌లో వీరి పలకరింపులు కొనసాగాయి. 2020లో ఆమె మళ్లీ ఇండియా వచ్చి రాజస్తాన్ రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. అనుభవ్ ఆమెతో టచ్‌లో ఉన్నాడు. ఇంతలో లాక్డౌన్ వచ్చింది. ఫ్లయిట్లు కేన్సిల్ అయిపోయాయి. స్వదేశం వెళ్లే వీలు లేదు. ‘నువ్వు మా ఇంటికి వచ్చి ఉండు’ అని కోరాడు అనుభవ్. అతని తల్లి కూడా ఆమెను ఆదరించింది. అప్పుడే వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. లాక్డౌన్ ఎత్తేశాక సెకండ్ వేవ్ వచ్చింది. అది ముగుస్తూ ఉండగా అనుభవ్ ఉక్రెయిన్ వెళ్లి ఆమెను కలిశాడు. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో దుబాయ్‌లో కలిసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ మార్చిలోనే సౌత్‌ఢిల్లీలోని అనుభవ్ ఇంటిలో పెద్ద ఆర్భాటం లేకుండా చేసుకుందామనుకున్నారు. ఉక్రెయిన్‌లో ఉద్యోగం చేసుకుంటున్న అన్నా కావలసిన సమయానికి ఇండియా చేరుకుంటానులే అని నిశ్చింతగా ఉంది. యుద్ధమలుపు హటాత్తుగా ఫిబ్రవరిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మార్చిలో పెళ్లి పెట్టుకున్న ఈ జంట ఇక ఎడతెగని ఫోను సంభాషణల్లోకి దిగింది. ‘మొదట అతను వెంటనే బయల్దేరి వచ్చేయమన్నాడు. కాని రష్యా అంతకు తెగించదు అని నేను నిరాకరించాను. అప్పుడు మా ఇద్దరికీ ఫైటింగ్ జరిగింది. ఆ తర్వాత ట్రైన్ పట్టుకుని పోలాండ్ వెళ్లిపోమన్నాడు. నేను ఆ పనీ చేయలేదు. ఫిబ్రవరి 24న బాంబుల మోత మొదలయ్యింది. బంకర్లో దాక్కున్నాను. అక్కడే ఉండు అన్నాడు అనుభవ్. కాని బయలుదేరి ఇండియా వస్తున్నాను అని చెప్పాను. హడలిపోయాడు. అస్సలు కదలొద్దు అన్నాడు. కాని నేను బయలుదేరాను’ అంది ఢిల్లీలో దిగిన అన్నా. సాహసయాత్ర అన్నా కీవ్ నగరానికి దగ్గరిలోని ఊరిలో ఉంటుంది. కీవ్ నగరం మీద ఫిబ్రవరి 24న బాంబులు పడ్డాయి. వెంటనే ఆమె రెండు మూడు రోజులు తల్లితో పాటు షెల్టర్లలో ఉండిపోయింది. 27 వ తేదీ ఉదయం ఇక లాభం లేదని తల్లితో, తన కుక్కతో ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది. ఆమె దగ్గర ఉన్నది ఉన్నిబట్టలు మాత్రమే. అక్కడి నుంచి తల్లిని అమ్మమ్మ ఉంటున్న తమ సొంత ఊరు కమియంకాకు తీసుకెళ్లి వదిలింది. అమ్మమ్మా... పెళ్లి చేసుకోవడానికి ఇండియా వెళుతున్నా అంటే ఆమె కాఫీ మిషన్‌ను పెళ్లి కానుకగా ఇచ్చింది. దానిని తీసుకుని కీవ్ నగరానికి అదే రోజు రాత్రి చేరుకుంది. ఎందుకంటే కీవ్ సరిహద్దు పశ్చిమ పోలాండ్ సరిహద్దుకు దగ్గర. కాని పోలాండ్‌కు వెళ్లడానికి వేలాది మంది రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారని ఆమెకు తెలిసింది. దాంతో అన్నా ఆ రాత్రి ఇంకో బస్ పట్టుకుని స్లోవేకియా చేరుకుంది. అక్కడి పోలాండ్‌కు చేరుకుని క్రాకో అనే ఊళ్లో రెండు వారాలు ఉండిపోయింది. ఫ్రెండ్స్ ఆమెకు సాయం చేశారు. పోలాండ్‌లో ఉన్న భారత ఎంబసీలో వీసాకు అప్లై చేస్తే దొరికింది. అలా ఆమె బయలుదేరి మార్చి 25న ఢిల్లీ చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో వరుడు ఆమె వచ్చే సమయానికి ఎయిర్‌పోర్ట్‌లో అనుభవ్ బాజా భజంత్రీలతో స్వాగతం చెప్పాడు. అక్కడే మోకాళ్ల మీద కూలబడి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ‘నేను చచ్చే అలసటలో ఉన్నాను. కాని అతను చేసిన పని బాగనే అనిపించింది’ అంది అన్నా. అనుభవ్ తల్లి పూలతో ఆమెకు స్వాగతం చెప్పింది. ‘మా పెళ్లికి పేపర్స్ రెడీ చేస్తున్నాం’ అన్నాడు అనుభవ్. ‘నా వీసా ఒక సంవత్సర కాలం ఉంది. ఈలోపు మా దేశం ఏమవుతుందో చూడాలి’ అంది అన్నా. ఒక విధ్యంసం జరుగుతున్నప్పుడు మనుషుల మధ్య పొంగె ఇలాంటి ప్రేమే ఆశను కలిగిస్తుంది. యుద్ధం ఎప్పుడూ ఓడిపోతుంది. ప్రేమ గెలుస్తుంది. -
ఆ సెంటిమెంట్ గురించే చెప్పకపోతే నిక్ చంపేస్తాడు: ప్రియాంక చోప్రా
సాక్షి,ముంబై: బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్ కంటే గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జోడీనే. 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా తన ఎంగేజ్మెంట్ రింగ్ సెంటిమెంట్ గురించి ప్రియాంక చోప్రా జోనాస్ చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్ చంపేస్తాడు అంటూ చమత్కరించింది. (Samantha: డబుల్ ధమాకా, అభినందనల వెల్లువ) ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్మెంట్ రింగ్ తనకు అత్యంత ప్రియమైన ఆభరణమని వెల్లడించింది. వాస్తవానికి తనజ్యుయల్లరీ ప్రతీదానికిఒక సెంటిమెంట్ ఉంటుందని అందుకేప్రతీదాన్ని అపురూపంగా చూసుకుంటానని తెలిపింది. ముఖ్యంగా తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మక మైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్ ఉందని వెల్లడించింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల రూపాయల ఈ డైమండ్ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్ ఉందంటూ బ్యాక్‌స్టోరీని వివరించింది. ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా వివిధ సందర్భాలలో దీనిపై మాట్లాడుతూ ప్రత్యేకంగా ఉండేలా, అదీ పీసీ తండ్రికి సంబంధం ఉండేలా తమ ఎంగేజ్మెంట్ రింగ్‌ను టిఫనీస్నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నాడు. కాగా సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే భర్తతో కలిసి సంబరంగా జరుపుకున్న దీపావళి వేడుకల ముచ్చట్లను కూడా ఇటీవల షేర్ చేసింది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ప్రపోజ్: ప్రేయసి ఉంగరాన్ని ఇంకో లవర్‌కు
ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప. చాలామంది చాటుగా ప్రేమిస్తూ ఊహల్లోనే కాలం గడిపేస్తుంటారు. అమ్మాయికు ఎదురు వెళ్లాలన్నా, ఆమెకు మనసులోని మాట చెప్పాలన్నా ధైర్యం చాలదు. క్షణాలు రోజులై, రోజులు నెలలై, నెలలు సంవత్సరాలైనా ప్రేమ విషయం చెప్పకుండా వన్‌సైడ్ లవర్స్‌గానే మిగిలిపోతుంటారు. మరికొందరు మాత్రం ఫోన్ నంబర్ మార్చినంత ఈజీగా ప్రేమికులను మారుస్తుంటారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి రెండో రకానికి చెందినవాడు. ఇంతకీ ఫ్లోరిడాకు చెందిన ఈ రోమియో ఏం చేశాడో తెలియాలంటే ఇది చదివేయండి.. ఫ్లోరిడా: అమెరికాలోని జోసెఫ్ డేవిస్ ఫ్లోరిడాలోని ఆరెంజ్ సిటీకి చెందిన ఓ యువతి మీద మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతికి చెప్పగా ఆమె కూడా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అంతా బాగానే ఉన్నందుకున్న క్రమంలో ప్రియుడు సరిగా టచ్‌లో లేకుండా పోయాడు. ఓ రోజు అతడి ఫేస్‌బుక్‌ను చూస్తుండగా ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనిపించింది. మరీ పరిశీలించి చూస్తే ఆ వజ్రపు ఉంగరం తనదే. ఎందుకైనా మంచిది, అది తనదేనా? కాదా? అన్న అనుమానంతో తన బీరువా అంతా వెతికి చూడగా ఖాళీ ఉంగరం బాక్సు మాత్రమే దర్శనమిచ్చింది. పైగా మరికొన్ని ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తిచ్చింది. వీటన్నిటి విలువ 6,270 డాలర్లుగా ఉంది. దీంతో ఆగ్రహించిన ఆరెంజ్ సిటీ యువతి అతడిని నిలదీసింది. దీంతో అతడు కొన్నింటిని తిరిగిచ్చేసేందుకు అంగీకరించాడు. ఇంత జరిగాక అతడితో కలిసి జీవితం పంచుకోలేనని నిర్ణయించుకున్న యువతి అతడికి కటీఫ్ చెప్పింది. ఇదిలా వుంటే ఆరెంజ్ సిటీ మహిళ ఆఫీసుకు వెళ్లినప్పుడు తన ప్రియురాలిని తీసుకుని నేరుగా ఆమె ఇంటికే తీసుకెళ్లాడట. ఇక డేవిస్.. జో బబ్రౌన్, మార్కస్ బబ్రౌన్ అనే మారుపేర్లతో చాలామంది అమ్మాయిలను బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ -
ఆరు కోట్ల ఎంగేజ్మెంట్ రింగ్!
టాప్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో త్వరలోనే ‘అధికారికంగా’ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జార్జినా రోడ్రిగ్స్‌తో ఇటీవలే అతని ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే విశేషం అది కాదు. తన ఎంగేజ్మెంట్ సందర్భంగా ఆమెకు 6 లక్షల 15 వేల పౌండ్లు (సుమారు. 5.8 కోట్లు) తొడిగినట్లు సమాచారం. ఇలాంటి అంశాల గురించి ప్రకటించే ‘గ్యాంబ్లింగ్ డీల్స్’ అనే సంస్థ భారీ విలువ గల ఎంగేజ్మెంట్ రింగ్‌లు అందించిన ఫుట్బాలర్లతో ఏకంగా ఒక జాబితానే రూపొందించింది. ఇందులో అన్నింటికంటే రొనాల్డోనే టాప్ అని ఆ సంస్థ వెల్లడించింది. రొనాల్డోకు గతంలోనే ముగ్గురు పిల్లలు ఉండగా...జార్జినా ద్వారా 2017లో పాప పుట్టింది. -
వైరల్: కుక్క నోటి నుంచి కక్కించారు
కేప్‌టౌన్: ధగధగ మెరిసిపోతున్న ఉంగరాన్ని చూసి అదేదో కొత్తరకం ఆహారం అనుకుందో ఏమో ఆ కుక్క. వెంటనే లటుక్కున నోట్లో వేసుకుంది. ఇది గమనించిన యజమానురాలి గుండెలదిరిపోయాయి. వెంటనే దాన్ని చంకనేసుకుని ఆసుపత్రికి పరుగు పెట్టింది. ఎందుకంటే అది మామూలు ఉంగరం కాదు.. ఎంతో ఖరీదు చేసే నిశ్చితార్థపు ఉంగరం. అయితే ఆసుపత్రి వాళ్లు కుక్క కడుపులో నుంచి చాకచక్యంగా ఉంగరాన్ని బయటికి తీశారు. ఈ అరుదైన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. పొరపాటున మింగిన ఉంగరాన్ని బయటకు తీయడం కోసం యజమానురాలు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెప్పర్(కుక్క)కు కృత్రిమ వాంతులు చేయించారు వైద్యులు. తద్వారా దాని నోటి నుంచి రింగ్‌ను బయటకు కక్కించారు. దీంతో కుక్క కాస్త సుస్తీ పడ్డట్లు కనిపించినా దాని ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని వైద్యులు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్నంతటినీ ఫొటోలతో సహా ఆసుపత్రి యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. కుక్కను, దాని కడుపులో ఉన్న ఉంగరాన్ని గుర్తించేందుకు తీసిన ఎక్స్‌రేను, ఎట్టకేలకు బయటకు దీసిన ఉంగరం ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ కుక్కపై జాలిపడాలో యజమానురాలికి ఎదురైన అనుభవానికి నవ్వుకోవాలో తెలియడం లేదని అయోమయంలో పడ్డారు.(చదవండి: ప్రపంచంలో మనుషులే భయంకరమైన జంతువులు) -
కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..
-
కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..
కాలిఫోర్నియా : నిద్రలో వచ్చే కలలు ఉదయం లేచేసరికి గుర్తుండం చాలా అరుదు. అయితే అలా వచ్చిన కలలు వాస్తవంలో జరుగుతాయా లేదా అంటే చెప్పడం కష్టం. కానీ ఓ మహిళ మాత్రం తనకు నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని నిద్రలోనే తన నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేసింది. ఈ విచిత్ర ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాలు.. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోకు చెందిన జెన్నా ఎవాన్స్ అనే మహిళకు ఇటీవలే బాబీ హోవెల్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఓ రాత్రి జెన్నా నిద్రలో ఉండగా.. ఆమెకు ఓ విచిత్రమైన కల వచ్చింది. జెన్నా, బాబీతో కలిసి ఓ రైలులో ప్రయానిస్తుండగా వారిని దొంగలు వెంబడించినట్లు కల వచ్చింది. ఈ క్రమంలో వారి నుంచి రక్షించుకోవడానికి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి నోటిలో వేసుకొని మింగేయమని బాబీ సలహా ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు జరిగింది కలే కాబట్టి బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు విషయం దాగుంది. నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని జెన్నా తన చేతికి ఉన్న ఉంగరాన్నినిజంగానే మింగేసింది. అనంతరం ఉదయం లేచిన ఆ మహిళ తన చేతిని చూసుకోగా ఉంగరం కనిపించలేదు. ఆ విషయాన్ని వెంటనే జెన్నా తనకు కాబోయే భర్తకు చెప్పింది. దీంతో డాక్టర్ వద్దకు వెళ్లి ఎక్స్‌రే తీయించుకున్నారు. ఎక్స్‌రే అనంతరం వైద్యుడు ఆ ఉంగరం కడుపులోనే ఉందని నిర్ధారించి చెప్పాడు. అప్పడు అసలు విషయం బయట పడింది. నిద్రలో వచ్చిన కలను నిజం అనుకొని ఉంగరాన్ని మింగేసినట్లు గుర్తించిన ఆ జంట చివరికి వైద్యుడి సహాయంతో ఎండోస్కోపి ద్వారా ఆ ఉంగరాన్ని బయటకు తీయించారు. ఉంగరం తిరిగి తన వద్దకు చేరుకున్నందుకు ఆనందంగా ఉందని, ఇదోక హాస్యాస్పదమైన కథ అంటూ ఈ విషయాన్నంతా జెన్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా వీరిద్దరు వచ్చే నెలలో టెక్సాస్‌లో వివాహం చేసుకోనున్నారు. -
అమ్మాయి ఒప్పుకొంది.. కానీ..
ప్రేమించిన అమ్మాయిని సర్ప్రైజ్ చేయడం కోసం అందమైన రింగ్ కొన్నాడు జాన్. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంగణం వద్దకు రాగానే తన ప్రేయసి డెనీల్లా వేలికి ఉంగరం తొడగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తపరిచి.. పెళ్లి ప్రపోజల్ కూడా ఆమె ముందు ఉంచాడు. జాన్ ప్రపోజల్‌కు సానుకూలంగా స్పందించిన డెనీల్లా నవ్వుతూ పెళ్లికి అంగీకరించింది. దీంతో తన జేబులో ఉన్న ఉంగరాన్ని తీసి ఆమె వేలికి తొడిగాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వేగంగా రావడంతో అతడి చేతిలో ఉన్న ఉంగరం కిందపడిపోయింది. ఎంత వెదికినా దొరకకపోవడంతో ఇద్దరూ నిరాశతో వెనుదిరిగారు. అయితే తను ఎంతో ఇష్టపడి కొన్న బహుమతిని కాబోయే భార్యకు ఇచ్చి తీరాలనుకున్న జాన్... ఉంగరం పోయిందంటూ న్యూయార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు వారి ట్విటర్ అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో 24 గంటలు గడిచేలోపు జాన్ ఉంగరం జాడ తెలిసింది. ఇలా కథ సుఖాంతం అవడంతో నెటిజన్లు, ఉంగరం జాడ చెప్పిన వారిని పోలీసులు ప్రశంసించారు. హమ్మయ్య కేసు క్లోజ్ అయిందంటూ తమదైన శైలిలో చమత్కరించారు. WANTED for dropping his fiancée’s ring in @TimesSquareNYC! She said Yes - but he was so excited that he dropped the ring in a grate. Our @NYPDSpecialops officers rescued it & would like to return it to the happy couple. Help us find them? 💍 call 800-577-TIPS @NYPDTIPS @NYPDMTN pic.twitter.com/tPWg8OE0MQ — NYPD NEWS (@NYPDnews) December 1, 2018 Here’s a photo of the ring our officers recovered (and cleaned!) Call 1-800-577-TIPS or DM @NYPDTips if you know the happy couple so we can return it to them! pic.twitter.com/hzFXxuMVJW — NYPD NEWS (@NYPDnews) December 1, 2018 -
ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు రెండు కోట్లా..!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ అభిమానులు రవీనా టాండన్‌కు కృతజ్ఞతలు తెలపుతున్నారు. ఇన్ని రోజులు అభిమానులతో దోబుచులాడిన ప్రియాంక ఎట్టకేలకు ఆ రహస్యాన్ని బయటపెట్టారు. ఇన్ని రోజులు ఎంగేజ్మెంట్ రింగ్‌గా ప్రచారం జరిగిన ఉంగరాన్ని ఎట్టకేలకు అందరికి కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చారు ప్రియాంక. రవినా టాండన్‌తో కలిసి దిగిన ఒక ఫోటోలో ప్రియాంక తన నిశ్చితార్థపు ఉంగరం కనిపించేలా ఫోటోకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఉంగరానికి ఓ చిన్న సైజు చరిత్ర ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ప్రముఖ హాలీవుడ్ డైమండ్ ఎక్స్పర్ట్ గ్రాంట్ మోబ్లే ఏమన్నారంటే.. ‘ఈ ప్రకృతిలో దొరికిన అతి అమూల్యమైన వాటిల్లో ఈ వజ్రం ఒకటి. ప్లాటినం ఉంగరంలో పొదిగిన ఈ దీర్ఘచతురస్రాకారపు వజ్రం చుట్టూ నలువైపులా చిన్న చిన్న వజ్రాలు పొదిగి ఉన్నాయ’ని తెలిపారు. ఇంత విలువైన ఈ వజ్రం ఖరీదు 3 లక్షల అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల ‘రెండు కోట్ల రూపాయల’న్నమాట. Peecee and I getting our pouts in order ! 😂 A post shared by Raveena Tandon (@officialraveenatandon) on Aug 14, 2018 at 1:08pm PDT ఈ ఉంగరాన్ని నిక్ జోనాస్ లండన్‌లోని ప్రముఖ ‘టిఫనీ అండ్ కో’ వజ్రాల దుకాణంలో కొన్నారంటా. ప్రియాంక లాంటి అందగత్తె కోసం షాపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని నిక్ ఒక రోజంతా ఆ దుకాణాన్ని మూసి వేయించి మరి అన్ని పరిశీలించి ఆఖరుకి ఈ ఇంత అందమైన ఉంగరాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన నిశ్చితార్థం, పెళ్లి విషయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రియాంక - నిక్ జోనాస్‌లు వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. -
మళ్లీ దొరికిపోయింది...
గత కొంతకాలంగా బాలీవుడ్లో హాట్ టాపిక్ అంటే ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్‌ల నిశ్చితార్ధం గురించే. ఇంతకు వీరికి ఎంగేజ్మెంట్ అయ్యిందా... లేదా అనే విషయం గురించి మాత్రం ఇంతవరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చే సంఘటన ఒకటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద చోటు చేసుకుంది. గతంలో ఒకసారి మీడియా వారి దృష్టిని తప్పించుకునే క్రమంలో ప్రియాంక, ఎంగేజ్మెంట్ రింగ్‌గా ప్రచారం పొందుతున్న ఉంగరాన్ని దాచే ప్రయత్నం చేసి, కెమరాకు దొరికిపోయింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరో సారి చోటు చేసుకుంది. ఈ నెల 6న(నేడు) జరగబోయే ‘ఫిక్కి’ కార్యక్రమంలో హాజరవ్వడం కోసం ప్రియాంక ఆదివారం రాజధానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు బయట మీడియా వారిని చూసిన ప్రియాంక, వెంటనే తన రింగ్ కానీ రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్‌ను మీడియా కంట పడకూడదనే ఉద్దేశంతో తిప్పేసుకుంది. కానీ ఏం లాభం.. ఈ సారి కూడా కెమరాకు దొరికిపోయింది. దాంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్‌లు వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకోసం ప్రియాంక సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు సమాచారం. కారణం ఏదైనా ప్రస్తుతం ప్రియాంక ‘భారత్’ చిత్రం నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవం. #priyankachopra arrives to delhi today ❤️😻 Guys did you see her hiding her ring😂 - #بريانكا_تشوبرا وصلت الى دلهي لحضور مؤتمر اليوم❤️😻 - ي جماعه ركزوا لما فسخت الخاتم و حطته بمخباتها بسرعه😂😂 مادري لين متى بتخش!! - - #queenofbollywood#queenofhearts#queenpri#Bollywood#priyanka#بوليوود A post shared by Perfection is ?! PeeCee👑 (@priyanka.news) on Aug 6, 2018 at 12:09am PDT -
రింగ్.. రింగ్.. రింగ్..!
ఎంగేజ్మెంట్ రింగ్‌కి ఉండే క్రేజే వేరు. ‘‘నీకు తోడుగా ఉంటా!’’ అని చెప్పే ఓ ధైర్యమది. మరి బంధాల్లో అలాంటి ఓ «ధైర్యానికి ఎంత విలువ ఉంటుంది? రూపాయిల్లో లెక్కిస్తామా అది? కూడదు. కానీ ఎప్పుడూ ఉంచుకోవాలి కాబట్టి ది బెస్ట్ అనుకునే ఉంగరమే కొనాలి. ఎన్ని ఆలోచించాలి? అన్ని ఆలోచిస్తాం కాబట్టే ఆ రోజూ, ఆ రింగూ అంత ప్రత్యేకం. అంత ప్రత్యేకమైనది కాబట్టే దాని చుట్టూ ఏది జరిగినా ఓ కథే. ఈమధ్య బయటకొచ్చిన అలాంటి కథలు.. చీప్.. చాలా చీప్..! లండన్‌లో ఉండే ఓ అబ్బాయికి తన కంపెనీలోనే పనిచేసే ఒకమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇద్దరి మధ్యా మంచి స్నేహం కూడా ఉంది. అమ్మాయికీ అతడంటే ఇష్టమే! ఓ మంచి రోజు చూసుకొని 1,300 యూరోలు (సుమారు లక్ష రూపాయలు) పెట్టి ఎంగేజ్మెంట్ రింగ్ కొని ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యాడు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఆమె ముందుకెళ్లి మోకాళ్ల మీద కూర్చొని, ‘‘నన్ను పెళ్లిచేసుకుంటావా?’’ అనడిగాడు. అమ్మాయి ఓకే చెబుదామనే సిద్ధమైంది కానీ, ఎంగేజ్మెంట్ రింగ్ తక్కువ ధరదేమో అని అనుమానించింది. అనుకున్నదే తడవుగా బ్యాగ్ చెక్ చేసి బిల్ చూసింది. అంతే! ‘‘ఇంత తక్కువలో ఇలా రింగు కొనేస్తావని అస్సలు అనుకోలేదు. నీ జీతమేంటీ? నువ్వు చేసిందేంటీ?’’ అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోవడంతో పాటు ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. కొందరు నవ్వారు. ఇంకొందరు విమర్శలు గుప్పించారు. మరికొందరు ‘‘నీకసలు ప్రేమ విలువ తెలుసా?’’ అంటూ గట్టిగానే మందలించారు. ఆ పోస్ట్‌కి వచ్చిన రెస్పాన్స్ చూశాక ఆ అమ్మాయిలో మార్పు వచ్చిందో లేదో తెలియదు కానీ, ఈ విషయం మాత్రం అంతటా పాకి ఆమెకు చెడ్డ పేరే తెచ్చింది. భర్తతో విడిపోయినా..! చీప్ రింగ్ కొన్నాడని బాయ్‌ఫ్రెండ్‌ను కాదన్న అమ్మాయిది ఒక కథైతే భర్తతో విడిపోయాక కూడా ఎంగేజ్మెంట్ రింగ్‌ను చేతికి అలాగే ఉంచుకున్న ప్రిన్సెస్ డయానాది మరో కథ. 1981లో ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్‌ను పెళ్లాడింది. డయానాకు ఓ ఖరీదైన ఉంగరాన్ని ఎంగేజ్మెంట్ రింగ్‌గా తొడిగి, ఆమెతో ఓ కొత్త జీవితం మొదలుపెట్టాడు చార్లెస్. 1992లో వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోయారు. అయితే భర్తతో విడిపోయాక కూడా డయానా తన చేతికి ఆ ఉంగరాన్ని అలాగే నాలుగేళ్ల పాటు ఉంచుకుంది. అదంతా చార్లెస్ ప్రేమను మరచిపోలేకే అనుకుంటారంతా. కానీ అసలు విషయం మాత్రం ఆమె చనిపోయిన 20 ఏళ్లకు, అంటే ఈమధ్యే బయటకు వచ్చింది. తమకు పుట్టిన పిల్లల కోసమే ఆ రింగును డయానా అలా ఉంచుకున్నారని తేలింది. డయానాకు పిల్లలంటే అంత ఇష్టం. డయానా కుమారుడు ప్రిన్స్ విలియమ్ తన భార్య కేట్ మిడిల్టన్కు ప్రపోజ్ చేస్తూ తొడిగిన ఉంగరం కూడా డయానాదే కావడం విశేషం. తల్లిమీద తనకున్న ప్రేమను విలియమ్ ఇలా చాటుకున్నాడు. ఒక్క రింగు చుట్టూ ఎన్ని కథలూ.. ఎన్నెన్ని ప్రేమలూ..!! క్యారట్ తొడిగిన రింగు..! మేరీ గ్రామ్స్‌కు 84 ఏళ్లు. గత పదమూడేళ్లుగా ఆమె దాచిన ఓ రహస్యం ఈమధ్యే ఓ క్యారట్ రూపంలో బయటకొచ్చింది. ఆ క్యారట్ చుట్టూ అల్లుకున్న ఉంగరమే మేరీ దాచిన సీక్రెట్. 1951లో నోర్మన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది గ్రామ్స్. గ్రామ్స్‌కు ప్రపోజ్ చేస్తూ నోర్మన్ ఓ ఖరీదైన ఉంగరాన్ని ఆమెకు తొడిగాడు. 2004లో గార్డెనింగ్ చేస్తున్న సమయంలో గ్రామ్స్ తన చేతికి ఉన్న డైమండ్ రింగును పోగొట్టుకుంది. చుట్టుపక్కల అంతా వెతికినా అది దొరకలేదు. చాలాకాలం ఏడ్చింది. నోర్మన్కు తెలిస్తే బాగుండదని ఒక కొత్త రింగును కొనుక్కొని ఆ పోయిన రింగు స్థానాన్ని భర్తీ చేసింది. మళ్లీ ఇప్పుడు 2017లో గ్రామ్స్ కోడలు తమ గార్డెన్లో పండిన క్యారెట్లను తీస్తూంటే ఒక క్యారట్‌ను చుట్టుకొని డైమండ్ రింగ్ ఉండడం కనిపించింది. గ్రామ్స్‌కు ఫోన్ చేస్తే ఇన్నాళ్లు దాచిన సీక్రెట్ చెప్పేసింది. 13 ఏళ్ల తర్వాత పోయిన ఉంగరం మళ్లీ కనిపించడం, అదీ ఒక క్యారట్‌కు చుట్టుకొని కనిపించడం వార్తలకు ఎక్కి కూర్చుంది. ఐదేళ్ల క్రితమే పైలోకాలకు వెళ్లిపోయిన ఆమె భర్త నోర్మన్కు మాత్రం ఈ రహస్యం ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. -
13 ఏళ్ల తర్వాత క్యారెట్లో దొరికిన రింగ్
ఒట్టావా : వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది ఎంగేజ్మెంట్. ఆ రోజు కాబోయే భర్త తొడిగే రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కెనడాకు చెందిన ఓ మహిళ తన ఎంగేజ్మెంట్ నాటి డైమండ్ రింగ్‌ను 13 ఏళ్ల కిందట పొగొట్టుకుంది. అయితే విచిత్రంగా ఆ రింగ్ ఓ క్యారెట్లో దొరికింది. వివరాలు... 13 ఏళ్ల కిందట ఇంటి ఆవరణలోని గార్డెన్లో అల్బర్టాకు చెందిన మేరీ గ్రామ్స్(84) కలుపు తీస్తుండగా ఎంతో ఇష్టంగా ధరించిన తన ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకుండాపోయింది. అయితే ఈ విషయాన్ని భర్త నార్మన్‌తో చెప్పాలేదు. గార్డెన్లో ఎన్నో రోజులు వెతికి వెతికి తన డైమండ్ రింగ్‌పై ఆశలు వదులుకుంది. కొన్ని రోజుల తర్వాత తన కుమారుడికి రింగ్ పోగొట్టుకున్న విషయం చెప్పింది. అల్బర్టాలోని అర్మెనా సమీపంలో ఒకప్పుడు మేరీ గ్రామ్స్ నివాసం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఆమె కుమారుడు క్యారెట్ పంట వేశాడు. కోడలు కొలీన్ డలే క్యారెట్లను సేకరించడానికి వెళ్లినప్పుడు వింత ఆకృతిలో పెరిగిన ఓ క్యారెట్ లభించింది. తొలత ఏదో పాడైన క్యారెట్‌గా భావించి పక్కన పడేయాలనుకున్నా.. చివరకు తనతో తీసుకువెళ్లింది. ఆ క్యారెట్‌ను శుభ్రం చేస్తుండగా అందులో రింగ్ ఉందని గుర్తించి తన భర్తకు ఈ విషయాన్ని తెలిపింది. అంతే వెంటనే రింగ్ దొరికిన విషయాన్ని మేరీ గ్రామ్స్తో చెప్పారు. 'మీరు పోగుట్టుకున్న రింగ్ మన గార్డెన్లో దొరికిందని చెప్పా. ఎంత చెప్పినా మేరీ గ్రామ్స్ నమ్మలేకపోయింది' అని కోడలు కొలీన్ డలే చెప్పారు.'రింగ్ దొరకడంతో ఉపశమనం పొందినట్టయింది. రింగ్లోపలికి క్యారెట్ వెళ్లినా పాడైపోలేదు' అని మేరీ గ్రామ్స్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులు అందరూ చూస్తుండగానే సబ్బుతో శుభ్రం చేసి వెంటనే ఆ రింగ్‌ను ధరించింది. తన భర్త ఎంగేజ్మెంట్ సమయంలో తనకిచ్చినప్పుటికన్నా ఇప్పుడు చాలా సులువుగా వేలికి పట్టిందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఐదేళ్ల కిందటే మేరీ గ్రామ్స్ భర్త నార్మన్ మృతిచెందారు. -
ఆమె నిశ్చితార్థ ఉంగరం దొరికింది!
విలక్షణ నటుడు విక్రమ్ కుమార్తె అక్షిత పోగొట్టుకున్న ఆమె నిశ్చితార్థ ఉంగరం ఎట్టకేలకు దొరికింది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌తో.. అక్షిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే స్నేహితులతో కలిసి చైన్నైలోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లిన అక్షిత.. చేతి వేలికి ఉంగరం లేకపోవడం గమనించింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించడం, అనుమానితులను ప్రశ్నించడంలాంటివి చేసినప్పటికీ ఉంగరం జాడ తెలియలేదు. అయితే తాజాగా లక్ష్మణన్ అనే ఓ క్యాబ్ డ్రైవర్.. అక్షిత ఉంగరాన్ని తెచ్చి ఇచ్చినట్లు తెలుస్తోంది. పోయిన ఉంగరం.. నిశ్చితార్థ ఉంగరం అని వార్తా పత్రికల్లో చదివిన లక్ష్మణన్, తనకు దొరికిన ఉంగరం అదేనని తెలుసుకుని వెంటనే విక్రమ్ ఫ్యామిలీకి అందజేసినట్లు సమాచారం. గాంధీ ఫౌండేషన్‌లో లక్ష్మణన్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా ఆ ఉంగరం విలువ రూ.12 లక్షల పైమాటేనట. -
ఆ ఉంగరం దొరికింది
తమిళసినిమా: నటుడు విక్రమ్ కూతురు అక్షిత నిశ్చితార్థపు ఉంగరం 10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. వ్యాపార వేత్త సీకే.రంగనాథన్ కొడుకు రంజిత్‌తో విక్రమ్ కూతురికి వివాహం నిశ్చయం అయ్యింది. రంజిత్ డీఎంకే నేత కరుణానిధి కొడుకు ఎంకే.ముత్తు కుమార్తె వళ్లి మనవడు అన్న విషయం తెలిసిందే. కాగా వీరి వివాహ నిశ్చితార్ధం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమంలో రంజిత్ తనకు కాబోయే భార్య చేతికి 10 లక్షల ఖరీదైన వజ్రపుటుంగరాన్ని తొడిగారు. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం స్థానిక థౌజెండ్ లైట్స్ ప్రాంతంలోని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లిన అక్షిత నిశ్చితార్థపు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఈ విషయమై థౌజెండ్‌లైట్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. పది రోజులుగా ఉంగరం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మణన్ టాక్సీడ్రైవర్ ఉంగరాన్ని విక్రమ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్షిత పోగొట్టుకున్న ప్రాం తంలోనే ఈ ఉంగరం టాక్సీడ్రైవర్ లక్ష్మణన్‌కు దొరికిం దట. అయితే దాని విలువ తెలియని అతను టాక్సీ ముందు భాగంలో పడేశారు. ఆ తరువాత విక్రమ్ కూతురు ఉంగరం పోయిందన్న విషయం తెలిసి ఒక వేళ తనకు దొరికిన ఉంగరం అదే అయ్యి ఉంటుందేమోనని భావించి గుమ్మిడిపూండిలోని గాంధీ ఆశ్రమానికి చెందిన రాజేశ్‌కు ఉంగరం దొరికిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే విక్రం కుటుంబ సభ్యులకు తెలిపిన అనంతరం ఇంటికి వెళ్లి ఉంగరాన్ని అప్పగించి వచ్చారు.