ప్రపోజ్‌: ప్రేయసి ఉంగరాన్ని ఇంకో లవర్‌కు | Florida Man Propose Girlfriend With Ring Stolen From Another Lover | Sakshi
Sakshi News home page

ఒకరితో పెళ్లికి, మరొకరితో ప్రేమకు రెడీ!

Feb 14 2021 12:39 PM | Updated on Feb 14 2021 12:43 PM

Florida Man Propose Girlfriend With Ring Stolen From Another Lover - Sakshi

ఓ రోజు ప్రియుడి ఫేస్‌బుక్‌ను చూస్తుండగా ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనిపించింది. మరీ పరిశీలించి చూస్తే ఆ వజ్రపు ఉంగరం తనదే.

ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప. చాలామంది చాటుగా ప్రేమిస్తూ ఊహల్లోనే కాలం గడిపేస్తుంటారు. అమ్మాయికు ఎదురు వెళ్లాలన్నా, ఆమెకు మనసులోని మాట చెప్పాలన్నా ధైర్యం చాలదు. క్షణాలు రోజులై, రోజులు నెలలై, నెలలు సంవత్సరాలైనా ప్రేమ విషయం చెప్పకుండా వన్‌సైడ్‌ లవర్స్‌గానే మిగిలిపోతుంటారు. మరికొందరు మాత్రం ఫోన్‌ నంబర్‌ మార్చినంత ఈజీగా ప్రేమికులను మారుస్తుంటారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి రెండో రకానికి చెందినవాడు. ఇంతకీ ఫ్లోరిడాకు చెందిన ఈ రోమియో ఏం చేశాడో తెలియాలంటే ఇది చదివేయండి..

ఫ్లోరిడా: అమెరికాలోని జోసెఫ్‌ డేవిస్‌ ఫ్లోరిడాలోని ఆరెంజ్‌ సిటీకి చెందిన ఓ యువతి మీద మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతికి చెప్పగా ఆమె కూడా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అంతా బాగానే ఉన్నందుకున్న క్రమంలో ప్రియుడు సరిగా టచ్‌లో లేకుండా పోయాడు. ఓ రోజు అతడి ఫేస్‌బుక్‌ను చూస్తుండగా ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనిపించింది. మరీ పరిశీలించి చూస్తే ఆ వజ్రపు ఉంగరం తనదే. ఎందుకైనా మంచిది, అది తనదేనా? కాదా? అన్న అనుమానంతో తన బీరువా అంతా వెతికి చూడగా ఖాళీ ఉంగరం బాక్సు మాత్రమే దర్శనమిచ్చింది. పైగా మరికొన్ని ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తిచ్చింది. వీటన్నిటి విలువ 6,270 డాలర్లుగా ఉంది. 

దీంతో ఆగ్రహించిన ఆరెంజ్‌ సిటీ యువతి అతడిని నిలదీసింది. దీంతో అతడు కొన్నింటిని తిరిగిచ్చేసేందుకు అంగీకరించాడు. ఇంత జరిగాక అతడితో కలిసి జీవితం పంచుకోలేనని నిర్ణయించుకున్న యువతి అతడికి కటీఫ్‌ చెప్పింది. ఇదిలా వుంటే ఆరెంజ్‌ సిటీ మహిళ ఆఫీసుకు వెళ్లినప్పుడు తన ప్రియురాలిని తీసుకుని నేరుగా ఆమె ఇంటికే తీసుకెళ్లాడట. ఇక డేవిస్‌.. జో బబ్రౌన్‌, మార్కస్‌ బబ్రౌన్‌ అనే మారుపేర్లతో చాలామంది అమ్మాయిలను బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.

చదవండి: 'నేను ఏలియన్‌ని' మస్క్ షాకింగ్ కామెంట్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement