New York Police Finds Ring Who Lost it After Proposed His Girlfriend - Sakshi
Sakshi News home page

అమ్మాయి ఒప్పుకొంది.. కానీ..

Published Mon, Dec 3 2018 11:13 AM | Last Updated on Mon, Dec 3 2018 2:25 PM

New York Police Find Lost Ring Couple Through Online Investigation - Sakshi

ప్రేమించిన అమ్మాయిని సర్‌ప్రైజ్‌ చేయడం కోసం అందమైన రింగ్‌ కొన్నాడు జాన్‌. న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్ ప్రాంగణం వద్దకు రాగానే తన ప్రేయసి డెనీల్లా వేలికి ఉంగరం తొడగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తపరిచి.. పెళ్లి ప్రపోజల్‌ కూడా ఆమె ముందు ఉంచాడు. జాన్‌ ప్రపోజల్‌కు సానుకూలంగా స్పందించిన డెనీల్లా నవ్వుతూ పెళ్లికి అంగీకరించింది. దీంతో తన జేబులో ఉన్న ఉంగరాన్ని తీసి ఆమె వేలికి తొడిగాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వేగంగా రావడంతో అతడి చేతిలో ఉన్న ఉంగరం కిందపడిపోయింది. ఎంత వెదికినా దొరకకపోవడంతో ఇద్దరూ నిరాశతో వెనుదిరిగారు.

అయితే తను ఎంతో ఇష్టపడి కొన్న బహుమతిని కాబోయే భార్యకు ఇచ్చి తీరాలనుకున్న జాన్‌... ఉంగరం పోయిందంటూ న్యూయార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్‌ పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు వారి ట్విటర్‌ అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌ వైరల్‌ కావడంతో 24 గంటలు గడిచేలోపు జాన్‌ ఉంగరం జాడ తెలిసింది. ఇలా కథ సుఖాంతం అవడంతో నెటిజన్లు, ఉంగరం జాడ చెప్పిన వారిని పోలీసులు ప్రశంసించారు. హమ్మయ్య కేసు క్లోజ్‌ అయిందంటూ తమదైన శైలిలో చమత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement