ఆ ఉంగరం దొరికింది | Vikram's daughter gets lost engagement ring back from cab driver; it's not just her who's lucky | Sakshi
Sakshi News home page

ఆ ఉంగరం దొరికింది

Published Sun, Aug 14 2016 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

ఆ ఉంగరం దొరికింది - Sakshi

ఆ ఉంగరం దొరికింది

 తమిళసినిమా: నటుడు విక్రమ్ కూతురు అక్షిత నిశ్చితార్థపు ఉంగరం 10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. వ్యాపార వేత్త సీకే.రంగనాథన్ కొడుకు రంజిత్‌తో విక్రమ్ కూతురికి వివాహం నిశ్చయం అయ్యింది. రంజిత్ డీఎంకే నేత కరుణానిధి కొడుకు ఎంకే.ముత్తు కుమార్తె వళ్లి మనవడు అన్న విషయం తెలిసిందే. కాగా వీరి వివాహ నిశ్చితార్ధం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమంలో రంజిత్ తనకు కాబోయే భార్య చేతికి 10 లక్షల ఖరీదైన వజ్రపుటుంగరాన్ని తొడిగారు.
 
  ఇదిలా ఉండగా పది రోజుల క్రితం స్థానిక థౌజెండ్ లైట్స్ ప్రాంతంలోని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లిన అక్షిత నిశ్చితార్థపు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. ఈ విషయమై థౌజెండ్‌లైట్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. పది రోజులుగా ఉంగరం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మణన్ టాక్సీడ్రైవర్ ఉంగరాన్ని విక్రమ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్షిత పోగొట్టుకున్న ప్రాం తంలోనే ఈ ఉంగరం టాక్సీడ్రైవర్ లక్ష్మణన్‌కు దొరికిం దట.
 
 అయితే దాని విలువ తెలియని అతను టాక్సీ ముందు భాగంలో పడేశారు. ఆ తరువాత విక్రమ్ కూతురు ఉంగరం పోయిందన్న విషయం తెలిసి ఒక వేళ తనకు దొరికిన ఉంగరం అదే అయ్యి ఉంటుందేమోనని భావించి గుమ్మిడిపూండిలోని గాంధీ ఆశ్రమానికి చెందిన రాజేశ్‌కు ఉంగరం దొరికిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే విక్రం కుటుంబ సభ్యులకు తెలిపిన అనంతరం ఇంటికి వెళ్లి ఉంగరాన్ని అప్పగించి వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement