ఆ సెంటిమెంట్ గురించే చెప్పకపోతే నిక్‌ చంపేస్తాడు: ప్రియాంక చోప్రా | Priyanka Chopra Jonas Sentimental Engagement Ring says very special | Sakshi
Sakshi News home page

Priyanka Chopra Jonas : దాని గురించి చెప్పకపోతే నిక్‌ చంపేస్తాడు!

Published Wed, Nov 10 2021 1:49 PM | Last Updated on Wed, Nov 10 2021 4:26 PM

Priyanka Chopra Jonas Sentimental Engagement Ring says very special - Sakshi

సాక్షి,ముంబై: బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో మోస్ట్‌ లవబుల్‌  కపుల్‌ కంటే  గుర్తొచ్చేది  ప్రియాంక చోప్రా,  నిక్ జోనాస్‌ జోడీనే.  2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన  ఈ లవ్‌బర్డ్స్‌ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు.  తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ సెంటిమెంట్‌ గురించి ప్రియాంక చోప్రా జోనాస్ చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్‌ చంపేస్తాడు అంటూ చమత్కరించింది. (Samantha: డబుల్‌ ధమాకా, అభినందనల వెల్లువ)

ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్‌మెంట్  రింగ్‌ తనకు అత్యంత ప్రియమైన ఆభరణమని వెల్లడించింది. వాస్తవానికి తనజ్యుయల్లరీ ప్రతీదానికిఒక సెంటిమెంట్‌ ఉంటుందని అందుకేప్రతీదాన్ని అపురూపంగా చూసుకుంటానని తెలిపింది. ముఖ్యంగా తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మక మైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్‌ ఉందని వెల్లడించింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్‌ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల రూపాయల ఈ డైమండ్‌ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్‌ ఉందంటూ బ్యాక్‌స్టోరీని వివరించింది. 
  


 ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా వివిధ సందర్భాలలో దీనిపై మాట్లాడుతూ ప్రత్యేకంగా ఉండేలా, అదీ పీసీ తండ్రికి సంబంధం ఉండేలా తమ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను టిఫనీస్‌నుంచి  కొనుగోలు చేసినట్టు పేర్కొన్నాడు. కాగా  సోషల్‌ మీడియాలో తరచూ వీడియోలు, ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే  భర్తతో కలిసి  సంబరంగా  జరుపుకున్న దీపావళి  వేడుకల ముచ్చట్లను కూడా ఇటీవల షేర్‌  చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement