sentimental
-
ఆ సెంటిమెంట్ గురించే చెప్పకపోతే నిక్ చంపేస్తాడు: ప్రియాంక చోప్రా
సాక్షి,ముంబై: బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్ కంటే గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జోడీనే. 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా తన ఎంగేజ్మెంట్ రింగ్ సెంటిమెంట్ గురించి ప్రియాంక చోప్రా జోనాస్ చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్ చంపేస్తాడు అంటూ చమత్కరించింది. (Samantha: డబుల్ ధమాకా, అభినందనల వెల్లువ) ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్మెంట్ రింగ్ తనకు అత్యంత ప్రియమైన ఆభరణమని వెల్లడించింది. వాస్తవానికి తనజ్యుయల్లరీ ప్రతీదానికిఒక సెంటిమెంట్ ఉంటుందని అందుకేప్రతీదాన్ని అపురూపంగా చూసుకుంటానని తెలిపింది. ముఖ్యంగా తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మక మైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్ ఉందని వెల్లడించింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల రూపాయల ఈ డైమండ్ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్ ఉందంటూ బ్యాక్‌స్టోరీని వివరించింది. ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా వివిధ సందర్భాలలో దీనిపై మాట్లాడుతూ ప్రత్యేకంగా ఉండేలా, అదీ పీసీ తండ్రికి సంబంధం ఉండేలా తమ ఎంగేజ్మెంట్ రింగ్‌ను టిఫనీస్నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నాడు. కాగా సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే భర్తతో కలిసి సంబరంగా జరుపుకున్న దీపావళి వేడుకల ముచ్చట్లను కూడా ఇటీవల షేర్ చేసింది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
జేడీఎస్ గెలవకపోతే నేను బతకను: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. గురువారం ఆయన బెంగళూరు నగరంలోని ఆర్.ఆర్.నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు. ‘నన్ను గెలిపిస్తే మిమ్మల్ని కాపాడతా, లేదంటే నేను ఎక్కువ రోజులు బతకను..జేడీఎస్ పార్టీ, మా భవిష్యత్ మీ తీర్పుపైనే ఆధారపడి ఉంది. జేడీఎస్‌కు అధికారమిస్తే కుటుంబ సభ్యుడిలా సేవలు చేస్తా.. కుమార స్వామి మరికొంత కాలం బతకాలని కోరుకుంటే జేడీఎస్‌కు అధికారం అప్పగించండి..’అంటూ ఉద్వేగంతో ప్రసంగించారు. -
సస్పెన్స్‌తో ప్రేమ
శివ, దివ్యా గౌడ్ జంటగా బేబి స్ఫూర్తి సమర్పణలో శ్రీ రాధ చంద్రీశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. బోయినిపల్లి వెంకటేశ్ గౌడ్ దర్శకుడు. లవ్, సెంటిమెంట్, సస్పెన్స్, కామెడీ మేళవించిన ప్రేమకథా చిత్రం ఇదని సహనిర్మాతలు గున్న మల్లేశ్ యాదవ్, మహ్మద్ గౌస్ చెప్పారు. -
అధికార పార్టీలో ఆందోళన!
ఓటింగ్ తగ్గడంతో మెజార్టీపై ప్రభావం కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్కంఠ నందిగామ : భారీ మెజార్టీపై ఆశలు పెట్టుకున్న అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించి ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కాంగ్రెస్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడంతో రెండు పార్టీల నేతలు నిరాశకు గురయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 1,84,064 ఓట్లకు గానూ, 1,27,906 ఓట్లు పోలయ్యాయి. 69.46 శాతం పోలింగ్ నమోదైంది. నందిగామ మండలంలో 65.21 శాతం, చందర్లపాడులో 72.02 శాతం, వీరులపాడులో 76.27, కంచికచర్లలో 67.19 శాతం పోలింగ్ నమోదైంది. సర్వశక్తులు ఒడ్డారు సానుభూతి, సెంటిమెంట్‌తో ఘన విజయం సాధించాలనే ఏకైక అజెండాతో అధికార టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. తమ అభ్యర్థి తంగిరాల సౌమ్య గెలుపు కోసం జిల్లా మంత్రులు, పార్టీ ముఖ్యులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మద్యం, డబ్బు భారీగానే పంపిణీ చేశారు. జిల్లా మంత్రి దేవినేని ఉమా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం 25 వేల ఓట్ల మెజార్టీ సాధించే దిశగా వ్యూహ రచన చేశారు. దీనికి అనుగుణంగా అన్ని పనులు చక్కబెట్టారు. అయితే అధికార పార్టీకి పట్టున్న కంచికచర్ల మండలంలో పోలింగ్ శాతం తగ్గింది. వీరులపాడు మండలంలో పోలింగ్ శాతం పెరిగినప్పటికీ గతంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే నమోదైంది. పోలింగ్ శాతం తగ్గడంతో సానుభూతితో సౌమ్య గెలుపొందినా, టీడీపీ నేతలు భావించిన మెజారిటీ వచ్చే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అధికార పార్టీ దందా ఎన్నికల ప్రచారం నుంచి అధికార పార్టీ హడావుడి కొనసాగింది. బరిలో ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్‌ను పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. పోలింగ్ రోజు 15 బూత్‌లలో కాంగ్రెస్ తరఫున ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ నేతల హవా సాగింది. అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆగడాలను చూసీచూడనట్లు వ్యవహరించారు. పోలింగ్ సరళి తక్కువగా ఉండటంతో ఆందోళనకు గురైన టీడీపీ నేతలు సాయంత్రం ఐదు గంటల సమయంలో నందిగామలోని జెడ్పీ స్కూల్లో ఒక్కొక్కరితో మూడు, నాలుగు ఓట్లు వేయించినట్లు సమాచారం. మోగులూరు, గనిఆత్కూరు, మున్నలూరు, తునికెనపాడులో కాంగ్రెస్‌కు ఏజెంట్లు లేరు. వీరులపాడు మండలం పొన్నవరంలో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్‌ను టీడీపీ నేతలు బెదిరించి బూత్‌కు రాకుండా చేశారు.