13 ఏళ్ల తర్వాత క్యారెట్‌లో దొరికిన రింగ్‌ | Mary Grams finds her engagement ring in carrot | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల తర్వాత క్యారెట్‌లో దొరికిన రింగ్‌

Published Thu, Aug 17 2017 8:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

13 ఏళ్ల తర్వాత క్యారెట్‌లో దొరికిన రింగ్‌

13 ఏళ్ల తర్వాత క్యారెట్‌లో దొరికిన రింగ్‌

ఒట్టావా :
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది ఎంగేజ్‌మెంట్‌. ఆ రోజు కాబోయే భర్త తొడిగే రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కెనడాకు చెందిన ఓ మహిళ తన ఎంగేజ్మెంట్‌ నాటి డైమండ్‌ రింగ్‌ను 13 ఏళ్ల కిందట పొగొట్టుకుంది. అయితే విచిత్రంగా ఆ రింగ్‌ ఓ క్యారెట్‌లో దొరికింది. వివరాలు... 13 ఏళ్ల కిందట ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో అల్బర్టాకు చెందిన మేరీ గ్రామ్స్‌(84) కలుపు తీస్తుండగా ఎంతో ఇష్టంగా ధరించిన తన ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకుండాపోయింది. అయితే ఈ విషయాన్ని భర్త నార్మన్‌తో చెప్పాలేదు. గార్డెన్‌లో ఎన్నో రోజులు వెతికి వెతికి తన డైమండ్‌ రింగ్‌పై ఆశలు వదులుకుంది. కొన్ని రోజుల తర్వాత తన కుమారుడికి రింగ్‌ పోగొట్టుకున్న విషయం చెప్పింది.

అల్బర్టాలోని అర్మెనా సమీపంలో ఒకప్పుడు మేరీ గ్రామ్స్ నివాసం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఆమె కుమారుడు క్యారెట్ పంట వేశాడు. కోడలు కొలీన్‌ డలే క్యారెట్లను సేకరించడానికి వెళ్లినప్పుడు వింత ఆకృతిలో పెరిగిన ఓ క్యారెట్‌ లభించింది. తొలత ఏదో పాడైన క్యారెట్‌గా భావించి పక్కన పడేయాలనుకున్నా.. చివరకు తనతో తీసుకువెళ్లింది. ఆ క్యారెట్‌ను శుభ్రం చేస్తుండగా అందులో రింగ్‌ ఉందని గుర్తించి తన భర్తకు ఈ విషయాన్ని తెలిపింది. అంతే వెంటనే రింగ్ దొరికిన విషయాన్ని మేరీ గ్రామ్స్‌తో చెప్పారు.

'మీరు పోగుట్టుకున్న రింగ్‌ మన గార్డెన్‌లో దొరికిందని చెప్పా. ఎంత చెప్పినా మేరీ గ్రామ్స్ నమ్మలేకపోయింది' అని కోడలు కొలీన్‌ డలే చెప్పారు.'రింగ్ దొరకడంతో ఉపశమనం పొందినట్టయింది. రింగ్‌లోపలికి క్యారెట్ వెళ్లినా పాడైపోలేదు' అని  మేరీ గ్రామ్స్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులు అందరూ చూస్తుండగానే సబ్బుతో శుభ్రం చేసి వెంటనే ఆ రింగ్ను ధరించింది. తన భర్త ఎంగేజ్‌మెంట్‌ సమయంలో తనకిచ్చినప్పుటికన్నా ఇప్పుడు చాలా సులువుగా వేలికి పట్టిందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఐదేళ్ల కిందటే మేరీ గ్రామ్స్‌ భర్త నార్మన్‌ మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement