ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఖరీదు రెండు కోట్లా..! | Priyanka Chopra Engagement Ring Cost | Sakshi
Sakshi News home page

ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఖరీదు రెండు కోట్లా..!

Published Thu, Aug 16 2018 11:23 AM | Last Updated on Thu, Aug 16 2018 11:26 AM

Priyanka Chopra Engagement Ring Cost - Sakshi

ప్రియాంక చోప్రా (ఫైల్‌ ఫోటో)

ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ అభిమానులు రవీనా టాండన్‌కు కృతజ్ఞతలు తెలపుతున్నారు. ఇన్ని రోజులు అభిమానులతో దోబుచులాడిన ప్రియాంక ఎట్టకేలకు ఆ రహస్యాన్ని బయటపెట్టారు. ఇన్ని రోజులు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌గా ప్రచారం జరిగిన ఉంగరాన్ని ఎట్టకేలకు అందరికి కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చారు ప్రియాంక. రవినా టాండన్‌తో కలిసి దిగిన ఒక ఫోటోలో ప్రియాంక తన నిశ్చితార్థపు ఉంగరం కనిపించేలా ఫోటోకు ఫోజులిచ్చారు.

అయితే ఈ ఉంగరానికి ఓ చిన్న సైజు చరిత్ర ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ప్రముఖ హాలీవుడ్‌ డైమండ్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రాంట్‌ మోబ్లే ఏమన్నారంటే.. ‘ఈ ప్రకృతిలో దొరికిన అతి అమూల్యమైన వాటిల్లో ఈ వజ్రం ఒకటి. ప్లాటినం ఉంగరంలో పొదిగిన ఈ దీర్ఘచతురస్రాకారపు వజ్రం చుట్టూ నలువైపులా చిన్న చిన్న వజ్రాలు పొదిగి ఉన్నాయ’ని తెలిపారు. ఇంత విలువైన ఈ వజ్రం ఖరీదు 3 లక్షల అమెరికన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల ‘రెండు కోట్ల రూపాయల’న్నమాట.

Peecee and I getting our pouts in order ! 😂

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

ఈ ఉంగరాన్ని నిక్‌ జోనాస్‌ లండన్‌లోని ప్రముఖ ‘టిఫనీ అండ్‌ కో’ వజ్రాల దుకాణంలో కొన్నారంటా. ప్రియాంక లాంటి అందగత్తె కోసం షాపింగ్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని నిక్‌ ఒక రోజంతా ఆ దుకాణాన్ని మూసి వేయించి మరి అన్ని పరిశీలించి ఆఖరుకి ఈ ఇంత అందమైన ఉంగరాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన నిశ్చితార్థం, పెళ్లి విషయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రియాంక - నిక్‌ జోనాస్‌లు వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement