
సల్మాన్‌ఖాన్
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్‌లోకి ఎప్పుడో ఎంటరయ్యారు. సల్మాన్ ఇంకా పెళ్లి కబురు చెప్పలేదు కానీ ఆయన్ని చిన్నారులు అంకుల్ అని పిలుస్తుంటే తెగ ఫీలైపోతున్నారట. గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్స్‌లో సల్మాన్ ఫ్రెండ్స్ పిల్లలు అంకుల్ అని పిలిచారట. దీంతో సల్మాన్ చిన్నారులను పిలిచి ‘అలా పిలవద్దు’ అని ముద్దుగా చెప్పారట.
కానీ పిడుగుల్లాంటి పిల్లలు పిలవద్దు అంటే ఆగుతారా? పైగా ఒక పని చేయవద్దు అంటే దాన్నే పనిగా పెట్టుకుంటారు పిల్లలు. సో.. అంకుల్ అని సరదాగా పిలుస్తూనే ఉన్నారట. ‘‘మీరు నన్ను అలా పిలిస్తే మీతో మీటింగ్స్ తగ్గిస్తా’’ అని సల్మాన్ చెప్పిన తర్వాత అంకుల్ అని పిలవడాన్ని తగ్గించారట పిల్లలు. సల్మాన్ భలే షరతు పెట్టారు కదా. ఇక సినిమాల విషయానికొస్తే... అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘భారత్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది.