
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారత్ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈద్ రోజు విడుదలైన ఈ మూవీ కేవలం నాలుగురోజుల్లోనే రూ 122.22 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. భారత్ తొలిరోజు రూ 42.30 కోట్లు రాబట్టి ఈద్ రోజు విడుదలైన సల్మాన్ మూవీల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన మూవీగా నమోదైంది. భారత్ శనివారం రూ 26.70 కోట్లు రాబట్టింది. భారత్ బాక్సాఫీస్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తోందని, సింగిల్ స్క్రీన్స్‌లో దుమ్మురేపుతున్న మూవీ మల్టీప్లెక్స్‌లోనూ సత్తాచాటుతోందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
భారత్ బాక్సాఫీస్ బిజినెస్ వివరాలు చూస్తే..బుధవారం రూ 42.30 కోట్లు వసూలు చేసిన మూవీ గురువారం రూ 31 కోట్లు, శుక్రవారం రూ 22.20 కోట్లు, శనివారం రూ 26.70 కోట్లు వసూలు చేసి మొత్తం భారత్‌లో రూ 122.20 కోట్లు రాబట్టినట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక భారత్ రూ 100 కోట్ల క్లబ్‌లో చేరిన సల్మాన్ ఖాన్ మూవీల్లో 14వ చిత్రంగా నిలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment