
రేపాలలో స్వచ్ఛభారత్
రేపాల(మునగాల): మండలంలోని రేపాలలోని ఎస్సీ కాలనీలో బుధవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్ చుట్టు పక్కన కంపచెట్లు, చెత్తచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో ఏడో వార్డు సభ్యుడు వెంకటేశ్వర్లు, యువజన సంఘం సభ్యులు లక్ష్మణ్, నవీన్, గోపి, నరేందర్, శ్రావణ్, స్వామి పాల్గొన్నారు.