ఇస్లామాబాద్: భారత్‌తో చర్చలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ పేర్కొంది. మాట్లాడుకోవడానికి ఉన్న మార్గాలన్నిటినీ పరిశీలించాల్సిందిగా కోరింది. చర్చలను నిలిపివేయడం వల్ల రెండు దేశాల మధ్య శాంతి నెలకొనకూడదని ఆశించేవారి లక్ష్యం నెరవేరినట్లవుతుందని పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి ఐజాజ్ చౌదరి అభిప్రాయపడ్డారు. వచ్చేనెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా రెండు దేశాల ప్రధాన మంత్రులు సమావేశమై అన్ని సమస్యలపైనా చర్చించాలని, తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పాలని ఆయన విలేకరుల సమావేశంలో ప్రతిపాదించారు. మ రోవైపు, నియంత్రణరేఖ (ఎల్‌ఓసీ) వద్ద భారత్ కాల్పులు జరిపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాక్ జాతీయ అసెంబ్లీ పేర్కొంది. ఈ మేరకు అది ఒక తీర్మానం ఆమోదించింది. అయితే, ఎల్‌ఓసీ వద్ద కాల్పుల విరమణను పాక్ సైన్యం మరోమారు ఉల్లంఘించి ఫిరంగి గుళ్ల వర్షం కురిపించింది.