టోర్నమెంట్ ఏదైనా భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. ఒకప్పుడు జాతీయ జట్లకే పరిమితమైన పోటీ ఇప్పుడు తృతీయ శ్రేణి జట్లకు కూడా పాకింది
సింగపూర్: టోర్నమెంట్ ఏదైనా భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. ఒకప్పుడు జాతీయ జట్లకే పరిమితమైన పోటీ ఇప్పుడు తృతీయ శ్రేణి జట్లకు కూడా పాకింది. ఇలాంటి నేపథ్యంలో మరో హోరాహోరీ పోరుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ టోర్నీ ఫైనల్ వేదిక కానుంది.
నేడు (ఆదివారం) కళింగ మైదానంలో భారత్, పాక్ అండర్-23 జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇదే టోర్నీలో లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది