
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఓ జంట. అంతలోనే భర్తకు ఆర్మీ నుంచి పిలుపొచ్చింది. దేశ సేవ కోసం వెంటనే సరిహద్దు దిశకు ప్రయాణం మొదలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఎలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు? అనే దృశ్యాలను వెండితెరపై చూడాలంటే ‘భారత్’ సినిమా చూడాల్సిందే. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, టబు కీలక పాత్రలు చేస్తున్నారు.
శనివారంతో ఈ సినిమా షూటింగ్ వంద రోజులకు చేరుకుంది. ఇంతటితో ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. చివరిగా ముంబైలో సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మాల్తా, అబుదాబి, లూధియానా, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. 1947 నుంచి 2000 కాలపరిణామ నేపథ్యంలో ఈ సినిమా స్రీన్‌ప్లే ఉంటుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment