
సల్మాన్ ఖాన్
అభిమానులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం కోసం హీరోలే ఎక్కువశాతం యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేస్తున్నారు. డూప్‌లకు స్కోప్ ఇవ్వనంటున్నారు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా కొన్నిసార్లు గాయాలపాలు అవుతూనే ఉంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా సెట్లో గాయపడ్డారట. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘భారత్’. ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతోంది. ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంటే సల్మాన్ గాయపడ్డారట. దాంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం ముంబై చేరుకున్నారు సల్మాన్. ఈ గాయం వివరాలేవీ చిత్రబృందం బయటకు చెప్పలేదు. షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment