మ్యూజిక్‌ టీచర్‌! | Katrina Kaif spotted playing harmonium | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ టీచర్‌!

Nov 5 2018 2:43 AM | Updated on Nov 5 2018 2:43 AM

Katrina Kaif spotted playing harmonium - Sakshi

కత్రినా కైఫ్

పైనున్న ఫొటో చూశారుగా! కథానాయిక కత్రినా కైఫ్‌ ఎంత ఏకాగ్రతతో సంగీత సాధన చేస్తున్నారో! ఇది చూసి ఆమె ఏమైనా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారా? అంటే అదేం కాదు. ఇదంతా తాజా ‘భారత్‌’ చిత్రం కోసం. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్, టబు, దిశా పాట్నీ కీలక పాత్రలు చేస్తున్న చిత్రమిది. కొరియన్‌ చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ చిత్రానికిది రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతోందట. ‘‘భారత్‌’ ప్రిపరేషన్‌లో భాగంగా ఇలా సంగీత సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కత్రినా. దీంతో ఈ సినిమాలో కత్రినా సింగర్‌గా కనిపిస్తారని కొందరు అంటుంటే.. లేదు లేదు.. మ్యూజిక్‌ టీచర్‌గా కనిపిస్తారని ఇంకొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ? అనేది వచ్చే ఏడాది రంజాన్‌కు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే ‘భారత్‌’ సినిమా రిలీజ్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement