
జోరుగా లగ్జరీ మార్కెట్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నప్పటికీ, లగ్జరీ మార్కెట్ మాత్రం జోరు గా ఉందని ఆసోచామ్ తాజా సర్వే పేర్కొంది. విలాస వస్తువులు, సేవల కొనుగోళ్లకు భారత సంపన్నులు వెనదీయడం లేదంటున్న ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..,
- 2012లో 650 కోట్ల డాలర్లుగా ఉన్న భారత లగ్జరీ మార్కెట్ గతేడాది 30 శాతం వృద్ధితో 850 కోట్ల డాలర్లకు పెరిగింది. మూడేళ్లలో 1,400 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా.
- అమెరికా, యూరప్‌ల్లో కుటుంబంతో విహార యాత్రకు వెళ్లడం, బ్రాండెడ్ ఆభరణాలు కొనుగోలు చేయడం, లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలు కొన డం, ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందు ఆరగించడం వంటి వాటికి అధిక మొత్తాల్లో ఖర్చు పెట్టడానికి సంపన్నులు సంశయించడం లేదు.
-
యువ జనాభా పెరుగుతుండడం, మిలియనీర్ల సంఖ్య పెరుగుతుండడం, ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షలు అధికం కావడం తదితర కారణాల వల్ల లగ్జరీ మార్కెట్ జోరుగా పెరుగుతోంది.