అన్ని వైఫల్యాలను నేరంగా చూడొద్దు
అసోచామ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది.
కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు.
కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్‌ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్‌గా పరిగణించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment