భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి కోసం తక్కువ చార్జీలతో పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డును మార్కెట్లోకి విడుదలజేసింది లైకా టెలీకం ఇండియా.
టీనగర్, న్యూస్‌లైన్:
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి కోసం తక్కువ చార్జీలతో పోస్ట్‌పెయిడ్ సిమ్‌కార్డును మార్కెట్లోకి విడుదలజేసింది లైకా టెలీకం ఇండియా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ సిమ్ కార్డు కోసం వినియోగదారులు చెల్లించే చార్జీ కంటే 70 నుంచి 90 శాతం వరకు రాయితీ ధరలో ఈ సిమ్ కార్డులను ప్రవేశ పెట్టింది. శుక్రవారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో లైకా మొబైల్ సీఈవో మిలింద్ కాంగ్లే,సీవోవో ప్రేమనాథన్ శివస్వామి, ఇంటర్నేషనల్ బిజినెస్ డైరక్టర్ అనిల్ శెట్టి తదితరులు కొత్త సిమ్‌కార్డులను మార్కెట్లోకి విడుదలజేశారు.
లైకా సంస్థ ద్వారా అంతర్జాతీయంగా నాణ్యమైన సేవలను వినియోగదారులకు అందించనున్నామని మిలింద్ కాంగ్లే తెలిపారు. భారతదేశం నుంచి వ్యాపారరీత్యా విదేశాలను సందర్శించేవారికి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. కుటీర, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, కార్పొరేట్ సంస్థల అధికారులు, ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులతో సహా వేలాది మంది వినియోగదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతమైన కనెక్షన్ సామర్థ్యంతో సిమ్‌కార్డు అవసరమౌతోందని, ఈ అవసరాన్ని లైకా సంస్థ గుర్తించిందన్నారు. ఇంగ్లాండ్, ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వంటి 17 దేశాలలో సేవలందిస్తున్నట్లు తెలిపారు. ప్రేమానందన్ శివస్వామి మాట్లాడుతూ, లైకా గ్రూప్ సంస్థ విస్తరణ కోసం రానున్న మూడేళ్లలో 100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో తమ సంస్థ 2014లో రూ.60 కోట్ల టర్నోవర్ సాధిం చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.