
భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు
భారత్ దీర్ఘకాలం నిలకడగా అధిక వృద్ధి సాధించగలదని ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టినందున.. విదేశీ పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
వాషింగ్టన్: భారత్ దీర్ఘకాలం నిలకడగా అధిక వృద్ధి సాధించగలదని ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టినందున.. విదేశీ పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో జరిగిన ఐడీఎఫ్‌సీ రెండో ఇన్‌ఫ్రా ఫండ్ నిధుల సమీకరణ మొదటి విడత ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిదంబరం ఈ విషయాలు చెప్పారు.
చిదంబరం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాం కుల గవర్నర్లు ఈ సమావేశంలోనూ పాల్గొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న స్వల్పకాలిక ఆర్థిక అనిశ్చితి సమస్యలను చక్కదిద్దేందుకు అమెరికా తక్షణమే చర్యలు తీసుకోవాలని జీ20 కూటమి దేశాలు ఈ సమావేశాల్లో సూచించాయి. ఉపాధి, సమ్మిళిత వృద్ధికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు, ఎకానమీ మళ్లీ సంక్షోభంలో చిక్కుకోకుండా చూసేం దుకు తగు చర్యలకు కట్టుబడి ఉంటామని సభ్య దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.