
ప్రపంచ బ్యాంకు(World Bank)లో పనిచేస్తూ కెరియర్‌ను ప్రారంభించాలని చూస్తున్నారా? ఎకనామిక్స్, ఫైనాన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంట్, ఇంజినీరింగ్, అర్బన్ ప్లానింగ్.. వంటి ఎన్నో రంగాల్లో అనుభవం పొందడానికి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు ‘ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025’ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అర్హతలు ఇవే..
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025కు అర్హత సాధించడానికి అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసుండాలి. లేదా ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో చేరాలి. ఇంగ్లిష్‌లో పట్టు ఉండాలి. కంప్యూటింగ్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్, చైనీస్ వంటి అదనపు ల్యాంగ్వేజీలపై పట్టు ఉంటే ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.
స్టైపెండ్, అలవెన్సులు, దరఖాస్తు ప్రక్రియ
ఈ ప్రోగ్రామ్‌లో చేరిన ఇంటర్న్‌లకు గంటలవారీగా స్టైపెండ్, అలవెన్స్‌లు ఉంటాయి. ఇంటర్న్‌షిప్ మేనేజర్ విచక్షణ మేరకు అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల కింద 3,000 డాలర్ల వరకు అలవెన్స్‌లు అందుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2025 ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో ప్రపంచ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రెజ్యూమె అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?
ఎంపిక విధానం
ఇంటర్న్‌షిప్‌లో చేరాలనుకునే అభ్యర్థులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి 2025 మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 2025 ఏప్రిల్‌లో తుది ఎంపిక ఉంటుంది. 2025 మేలో ఇంటర్న్ గ్రూప్ ప్రారంభం అవుతుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి 2025 మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment