
కత్రినా కైఫ్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరో బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మను రికమెండ్ చేయమని అడిగారు. సినిమా చాన్స్ కోసం అయితే కాదండోయ్. క్రికెట్ నేర్చుకోవడం గురించి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారత్’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు కత్రినా కైఫ్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక ఓ రోజు రాత్రి టీమ్‌తో కలిసి కత్రినా క్రికెట్ ఆడారు.
‘‘క్రికెట్ ప్రపంచ కప్ దగ్గరపడుతోంది. నా గురించి టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాస్త చెప్పు. (అనుష్కా శర్మ భర్త విరాట్ కోహ్లీ అన్న విషయం తెలిసిందే). నేను ఆల్ రౌండర్ అవ్వాలనుకుంటున్నాను. మన టైమ్ వస్తుంది’’ అని సరదాగా తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు కత్రినా. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 26న ‘భారత్’ చిత్రం టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment