సల్మాన్‌ 5.. కత్రినా 4! | Katrina Kaif's pose in ' Bharat' look with hairstylist | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ 5.. కత్రినా 4!

Published Fri, Nov 30 2018 5:56 AM | Last Updated on Fri, Nov 30 2018 5:56 AM

Katrina Kaif's pose in ' Bharat' look with hairstylist - Sakshi

ఇక్కడున్న ఫొటో చూశారుగా.. బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌ చీర కట్టుకుని ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈ లుక్‌ ఆమె నటిస్తున్న ‘భారత్‌’ సినిమాలోనిది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో దిశా పాట్నీ, జాకీష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నారు కత్రినా. అందులో ఇక్కడున్న లుక్‌ ఒకటి. అలాగే సల్మాన్‌ కూడా ఐదు డిఫరెంట్‌ లుక్స్‌లో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నారు. ఇక కత్రినా ఒక కథానాయికగా నటించిన ‘జీరో’ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానుంది. షారుక్‌ఖాన్‌ ఇందులో కథానాయకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement