భువనేశ్వర్: భారత్‌లో మానవ వనరులు భారీగా ఉన్నాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. రానున్న దశాబ్దాల్లో మన బలం ప్రతిభ గల మానవ వనరులేనని ఆయన చెప్పారు. ఇక్కడి కేఐఐటీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఇటీవల జరిగిన నాలుగవ నేషనల్ ఫైనాన్స్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.
భారత రూపాయి పతనం మన స్వల్పకాలిక సమస్య అని, తగ్గుతున్న ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక సమస్య అని ఆయన వివరించారు. గత 20 ఏళ్లలో దేశీయ పరిశ్రమలు చెప్పుకోదగ్గ వృద్ధి సాధించాయని, ఎగుమతుల్లో కీలక పాత్రను పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్లకు చేరడంలో ఈ పరిశ్రమలు ఇతోధికంగా తోడ్పడ్డాయని తెలిపారు. డిమాండ్ సంక్షోభం కారణంగానే అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. వర్థమాన దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్‌లు నమ్మశక్యంగాని వృద్ధిని సాధించాయని చెప్పారు.
మానవ వనరులే మన బలం: టీసీఎస్ చంద్రశేఖరన్
Published Mon, Sep 23 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement