నటుడు భరత్ బాల్యమంతా అక్కడే..
- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో విషాదఛాయలు
జగ్గంపేట: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మణం పాలయ్యారన్న వార్త వారి బంధువుల్లో విషాదాన్ని నింపింది. రవితేజ, భరత్, రఘులు బాల్యంలో ఎక్కువగా గడిపింది జగ్గంపేటలోని తమ మేనమామ ఇంట్లోనే కావడంతో అక్కడివారంతా భరత్‌ను తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు.
భరత్ తండ్రి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు కాగా తల్లి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. భరత్ సోదరులు బాల్యంలో ఎక్కువగా జగ్గంపేటలో గడవడంతో ఇక్కడ వారితో వారికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. జగ్గంపేట పరిసర ప్రాంతాలలో పొలాలు ఉండడంతో తరచూ ఇక్కడకు వస్తుండేవరని భరత్ సోదరుల మేనమామ శ్రీవత్సవాయి రాముడు(మీసాలరాజు), ఇతర కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.