వన్‌ మూవీ.. ఫైవ్‌ గెటప్స్‌ | Like Salman Khan, Priyanka Chopra will also sport five different looks | Sakshi
Sakshi News home page

వన్‌ మూవీ.. ఫైవ్‌ గెటప్స్‌

Published Sat, Jun 30 2018 12:20 AM | Last Updated on Sat, Jun 30 2018 12:20 AM

Like Salman Khan, Priyanka Chopra will also sport five different looks - Sakshi

ప్రియాంకా చోప్రా

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఏజ్‌ ప్రజెంట్‌ మూడు పదులకు మించి ఉంటుంది. ఆమె అరవై ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూడాలంటే మరో పాతికేళ్లు వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది వరకు వేచి చూస్తే చాలు. ఎందుకంటే.. ‘భారత్‌’ అనే సినిమాలో అరవై ఏళ్లున్న పాత్రలో నటించబోతున్నారు ప్రియాంక. అలీఅబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘భారత్‌’. కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. 1947 నుంచి 2010 మధ్య కాలం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగుతుంది.

సల్లూ భాయ్‌ ఫైవ్‌ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రియాంకా చోప్రా కూడా ఐదు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘‘సల్మాన్‌ఖాన్‌లా ప్రియాంకా చోప్రా కూడా ఈ చిత్రంలో ఫైవ్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారు. 28–60 ఇయర్స్‌ మధ్యలో సల్మాన్‌ కనిపిస్తే, 25–65 ఏజ్‌ గ్రూప్‌లో ప్రియాంకా ఫైవ్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో దర్శనమిస్తారు. ఇందుకు ప్రోస్థటిక్‌ మేకప్‌ వాడతాం. గ్రాఫిక్స్‌ కూడా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది రంజాన్‌కు ‘భారత్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement