ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి సత్తా! | art college student shines | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి సత్తా!

Published Sat, Feb 4 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

art college student shines

అనంతపురం ఎడ్యుకేషన్‌  :  ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి బి.భరత్‌ రాష్ట్రస్థాయి ఉపాన్యాసక పోటీల్లో సత్తా చాటి ఉత్తమ ఉపన్యాసక  అవార్డు కైవసం చేసుకున్నాడు. తిరుపతిలో 2 ,3 తేదీల్లో కృష్ణతేజం యువ సాంస్కృతిక  క్రీడా సమ్మేళనంలో రాష్ట్రస్థాయి ఉపన్యాసక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో భరత్‌ సత్తా చాటి ప్రథమస్థానంలో నిలిచాడు. భరత్‌ను ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి, అధ్యాపకులు అభినందించారు.

భరత్‌ ఇప్పటిదాకా రాష్ట్రస్థాయి పోటీల్లో 13సార్లు కళాశాల తరుఫున పాల్గొని అవార్డులు సాధించాడని ప్రిన్సిపల్‌ తెలిపారు. అలాగే రెండుసార్లు జాతీయస్థాయి అవార్డులు సాధించారని గుర్తు చేశారు. యువత భరత్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఏసీఆర్‌ దివాకర్‌రెడ్డి, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్‌ డి. శివకుమార్, డీడీఓ శ్రీనివాసులు, ఇతర అధ్యాపకులు భరత్‌ను అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement