భారత్‌కు మోటరోలా రీఎంట్రీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా.. చడీ చప్పుడు కాకుండా ఇక్కడి నుంచి కనుమరుగైన ఈ అమెరికా సంస్థ ఇప్పుడు భారత్‌లో తిరిగి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందుకోసం భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మార్కెటింగ్ వ్యూహ రచన చేసిన ఈ కంపెనీ, అన్ని ఆయుధాలను వినియోగించుకోవాలని విశ్వసిస్తోంది. అలాగే కొత్త మోడళ్ల వరుస ఆవిష్కరణలతోపాటు కస్టమర్లకు దగ్గరయ్యేందుకు దేశవ్యాప్తంగా ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లను తెరవనుంది. అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చి కస్టమర్లకు చేరువ కావాలన్నదే కంపెనీ ధ్యేయంగా కనిపిస్తోంది. గూగుల్ చేతుల్లోకి వెళ్లడం కూడా మోటరోలాకు భారత్ వంటి అపార అవకాశాలున్న మార్కెట్లు కలిసి వస్తాయన్నది నిపుణుల మాట.
టాప్ 5 కంపెనీల్లో: ఫోన్లు నాణ్యత ఉన్నా మార్కెటింగ్‌లో వెనుకంజ వేయడం, మోడళ్ల సంఖ్య కూడా అంతంతే ఉండడం భారత్‌లో కంపెనీ వైఫల్యానికి కారణం. అంతర్జాతీయ కంపెనీల స్మార్ట్ వ్యూహానికితోడు దేశీయ కంపెనీల ‘అందుబాటు ధర’ల మంత్రంతో కంపెనీ ఇక్కడ మనలేకపోయింది. దీంతో గత ఏడాది భారత్‌లో అమ్మకాలను నిలిపివేసింది.మొబైల్ ఫోన్ల అమ్మకాల పరంగా 2014 చివరినాటికి భారత్‌లో టాప్ 5 కంపెనీల్లో మోటరోలా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
జనవరిలో ‘మోటో జి’: ‘మోటో జి’ 3జీ ఫోన్‌తో మోటరోలా 2014 జనవరిలో భారత్‌లో అడుగు పెడుతుతోంది. మరో మోడల్ అయిన మోటో ఎక్స్ ఎప్పుడు భారత్‌లో విడుదలయ్యేది ఇప్పుడే చెప్పలేమని మోటరోలా ఉద్యోగి ఒకరు తెలిపారు.