తెలుగు పరిశ్రమలోనూ రాణిస్తా | actor bharath interview | Sakshi
Sakshi News home page

తెలుగు పరిశ్రమలోనూ రాణిస్తా

Published Fri, Aug 5 2016 6:30 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

actor bharath interview

సినీ హీరో భరత్‌
అమలాపురం టౌన్‌ :
తమిళంలో ఇప్పటి వరకూ దాదాపు 30 సినిమాల్లో హీరోగా నటించిన తాను తెలుగు పరిశ్రమలోనూ రాణించేందుకు శ్రమిస్తున్నానని హీరో భరత్‌ అన్నారు. తమిళంలో తాను నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్‌ కావటం ద్వారా ఆరేడేళ్లుగా తెలుగు పరిశ్రమకు సుపరిచితుడేనని చెప్పారు. రమా రీల్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ గత పదిరోజులుగా కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది. అమలాపురంలోని సర్‌ సీవీ రామన్‌ పబ్లిక్‌ స్కూలులో గురువారం జరిగిన ఆ చిత్ర షూటింగ్‌లో భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో నేరుగా హీరో అవకాశం ఏడాది కిందట ‘యువ సేన’ చిత్రం ద్వారా వచ్చిందన్నారు.

ఇప్పుడు తమిళ, తెలుగు వెర్షన్లలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం కూడా మంచి కథ ఉన్న సినిమా అని చెప్పారు. తాను హీరోగా నటించిన ‘ప్రేమిస్తే’ రెండు భాషల్లోనూ సూపర్‌ హిట్‌ కావడంతో హీరోగా మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ‘బోయ్స్‌’ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడైన తాను తమిళ, తెలుగు రంగాల్లో ఒకేసారి అరంగ్రేటం చేసినట్లయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కోనసీమలో షూటింగ్‌ జరుపుకొంటున్న చిత్రం రొమాంటిక్, యూత్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలబోసిన కథతో రూపొందుతున్నందున కచ్చితంగా హిట్‌ కాగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగలనన్న నమ్మకం బలంగా ఉందని భరత్‌ చెప్పారు. 
 
కేరళకు దీటుగా కోనసీమ సోయగాలు
కోనసీమలోని పచ్చని అందాలు కేరళ రాష్ట్రంలో కొబ్బరి చెట్లతో కూడిన పచ్చదనాన్ని గుర్తుకు తెస్తున్నాయని భరత్‌ అన్నారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు అధికంగా ఉంటాయని, ఇక్కడ కూడా అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని అన్నారు. మొత్తం మీద కోనసీమ తనను బాగా ఆకట్టుకుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement