- సినీ నటుడు జీవా
వెయ్యి సినిమాల్లో నటించా..
Published Sun, Nov 13 2016 10:05 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
విలనీ, కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో ప్రేక్షకాదరణ పొందిన నటుడు జీవా. తనదైన మాడ్యులేష¯ŒSతో గుర్తింపు పొందిన ఆయన షూటింగ్ నిమిత్తం ఆదివారం పసలపూడి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
– రాయవరం
‘గుంటూరుకు చెందిన నేను నటనపై ఆసక్తితో నాటకాలు వేస్తుండేవాడిని. ’తొలికోడి కూసింది’ సినిమాకు హీరో, ప్రతినాయకుడి వేషాల కోసం దర్శకుడు బాలచందర్ పత్రికా ప్రకటన ఇచ్చారు. అది చూసి నేను ఫొటోలు పంపగా పిలుపు వచ్చింది. అలా తొలి అవకాశం ‘తొలికోడి కూసింది’తో వచ్చింది. నా తొలి షూటింగ్ ఇదే జిల్లాలోని దోసకాయలపల్లిలో చేశాను. తొలికోడికూసింది సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటి వరకు వెయ్యి సినిమాల్లో నటించాను. తమిళంలో ‘న్యాయం కెడికిరే’ అనే సినిమాలో హీరోగా నటించాను. నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి పాత్రను ఇష్టపడే చేశాను. దర్శకులు ఎలా చెబితే అలా పాత్రలో ఒదిగి పోయేవాడే నటుడు. నటనను కూడా ఒక వృత్తిగా భావించాలి. ఇక్కడ వ్యక్తిగత ఇష్టాలు ఉండవు. ఇప్పటి వరకు గడిచిన సినీ జీవితం పూర్తి సంతృప్తినిచ్చింది’ అన్నారు జీవా.
Advertisement
Advertisement