ఆర్య ఫుల్‌గా ఇచ్చారు | Producer Srikanth interview | Sakshi
Sakshi News home page

ఆర్య ఫుల్‌గా ఇచ్చారు

Published Wed, Aug 17 2016 1:09 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఆర్య ఫుల్‌గా ఇచ్చారు - Sakshi

ఆర్య ఫుల్‌గా ఇచ్చారు

నటుడు ఆర్య నాకు పుల్ డోస్ ఇచ్చారు అని తెలిపారు నటుడు శ్రీకాంత్. ఏ భాషకైనా సొంతం అనిపించే నటుడీయన.తమిళం, తెలుగు భాషల్లో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తాజాగా నంబియార్ అనే చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించారు. ఇందులో ఆయనకు జంటగా సునైనా నటించారు. ప్రధాన పాత్రలో సంతానం నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు గణేశా పరిచయం అవుతున్నారు. చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత శ్రీకాంత్‌తో చిన్న భేటీ..
 
 ప్ర: నంబియార్ చిత్రం గురించి చెప్పండి?
 జ: సినిమాలో నటుడు హీరో ఎమ్జీఆర్ మంచి చేస్తారు. విలన్ నంబియార్ చెడు చేస్తారు. అయితే సాధారణంగా మనిషిలో ఎమ్జీఆర్, నంబియార్ ఇద్దరు ఉంటారు. తను మంచి ఆలోచనలు చేస్తున్నట్లే చెడు ఆలోచనలు కలుగుతుంటాయి.ఆ రెండు కలసిన చిత్రమే ఎమ్జీఆర్.
 
 ప్ర. ఎమ్జీఆర్, నంబియార్‌ల కాన్సెప్ట్‌ను ఎక్కడ పట్టారు?
 జ: ఆ క్రెడిట్ మాత్రం దర్శకుడు గణేశాకే దక్కుతుంది. ప్రతి మనిషి జీవితంలోనూ పోరాటం ఉంటుంది. ఒక పాత్ర గుణాల గురించి ఆ బాణిలో చెబితేనే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో హీరో పేరు రామచంద్రన్. తను పలు పోరాటాలతో సతమతం అవుతుంటాడు. అతనితోనే ఉంటూ మరింత అయోమయంలో పడేసే నంబియార్ పాత్రను సంతానం పోషించారు. నంబియార్ అన్నది కల్పిత పాత్ర. అదేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
 
 ప్ర: సంతానంతో నటించిన అనుభవం గురించి?
 జ: నిజం చెప్పాలంటే మా కాంబినేషనే చాలా ఆసక్తిగా ఉంటుంది. చిత్రం అంతా సంతానం ఉంటారు. చిత్రం లో ఒక పరిస్థితిలో సంతానం డైలాగ్స్‌కు నేను నటిస్తాను. అప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్, డైలా గ్ డెలివరీ, నటనను నేను చేయడం చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో సంతానంతో ఒక పాట కూడా పాడిం చాం.అది తాగుబోతు పాట. సవాల్‌తో కూడిన ఆ పాటను సంతానం ఒక గంటలో సునాయాసంగా పాడేశారు.
 
 ప్ర: చిత్రంలో ఆర్య, విజయ్‌ఆంటోని సర్‌ప్రైజ్ ఇస్తారట?
 జ: చిత్రంలో ఆరా అమరా అనే పాట ఉంది.ఆ చిత్రం కోసం వేసిన సెట్ బాగుందని తెలిసి విజయ్‌ఆంటోని చూడడానికి వచ్చారు. ఎలాగూ వచ్చారు కదాని ఆయనతో ఆ పాటలో ఒక స్టెప్ వేయించాం. ఇక హీరోకు సాయపడే ఒక మిత్రుడి సన్నివేశం ఉంది. ఆ పాత్రను ఆర్యతో నటింపజేస్తే బాగుందనిపించింది. ఆయన్ని అడగ్గానే వెంటనే ఓకే అన్నారు. ఆయనకు జంటగా నటి పార్వతీ ఒమన్‌కుట్టాన్ నటించారు. షూటింగ్ పూర్తి అయిన తరువాత మిత్రమా పేమెంట్ ఎంత ఇవ్వమంటావు అని అడగ్గా ఆర్య నాకు పుల్ డోస్ ఇచ్చారు. అవి మాటల్లో చెప్పలేను. డబ్బు సంపాదించక పోయినా ఆర్య లాంటి మంచి స్నేహితులను చాలా మందిని సంపాదించుకున్నాను. నంబియార్ చిత్రంలో దేవదర్శిని, జాన్ విజయ్, ఆదవన్ కామెడీ నటులు ఉన్నారు. జీవితంలో మనిషి ఎన్ని పోరాటాలను ఎదుర్కొంటాడు, వాటి నుంచి ఎలా బయట పడతాడు అన్న అంశాలను నంబియార్ చిత్రంలో చూపించాం. అయితే చిత్రంలో ద్వందర్థాలు లేవు, అశ్లీల సన్నివేశాలు అస్సలుండవు, వెలైన్స్ దృశ్యాలు ఉండవు. అయినా చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. బహుశా అవన్నీ ఉంటేనే యూ సర్టిఫికెట్ ఇస్తారేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement