
ఫోర్డ్... ఫిగో కాన్సెప్ట్ కార్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ ఫోర్డ్ ఫిగో కాన్సెప్ట్ కారును సోమవారం ఆవిష్కరించింది. భారత్‌లో 2018 నాటికి ఈ బి సెగ్మెంట్ కార్లు ఏడాదికి 20 లక్షల వరకూ అమ్ముడవుతాయని అంచనా. మొత్తం కార్ల అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ అమ్మకాలు మూడో వంతు ఉంటాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఫిగో, ఇకోస్పోర్ట్‌లు విజయవంతం కావడంతో మరో పటిష్టమైన కారును మార్కెట్లోకి తేవాలనుకున్నామని ఆ దిశగా ఈ ఫిగో కాన్సెప్ట్‌ను తెస్తున్నామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నిగెల్ హారిస్ చెప్పారు. ఈ కారును ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది ఆయన వెల్లడించలేదు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో 23 మోడళ్లను అందుబాటులోకి తెస్తామని, వీటిల్లో కొన్నింటిని భారత్‌లోకి తెస్తామని ఫోర్డ్ మోటార్ కంపెనీ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్(ఇంజనీరింగ్) కుమార్ గల్‌హోత్ర పేర్కొన్నారు.