
తమిళసినిమా: సినిమా వ్యాపారం, వసూళ్ల గురించి ఇవాళ భిన్న ప్రచారాలు చూస్తున్నాం. స్టార్స్ చిత్రాల వసూళ్లు వంద, రెండొందల కోట్ల క్లబ్‌లో అంటూ భారీ ప్రచారాలతో ఒక పక్క ఊదరగొడుతుంటే, మరో పక్క చిన్న చిత్రాలకు వ్యాపారం లేదు, డెఫిసిట్ అనే మాట వింటున్నాం. ఏటేటా చిత్రపరిశ్రమ స్లంప్‌ను ఎదుర్కొంటుందనే మాటే అధికంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిత్రం పూర్తిగా వ్యాపారం జరుపుకోవడం అంటే అది వరమే అవుతుంది. పొట్టు చిత్రం ఈ కోవకే చెందుతుందని ఆ చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. షాలోం స్డూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్, జోన్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం పొట్టు.
కాగా చిత్రం వివరాలను నిర్మాతలు తెలుపుతూ మనుషుల సాహసాల కంటే దెయ్యాల సాహసాలకే ప్రేక్షకుల నుంచి ఆదరణ అధికంగా ఉంటుందన్నారు. అలాంటి హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపిందిన చిత్రం పొట్టు అని చెప్పారు.
ఈ చిత్ర తెలుగు హక్కులను ఎన్‌కేఆర్ ఫిలింస్ అధినేతలు రూ.కోటికి కొనుగోలు చేశారని తెలిపారు. అక్కడ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఏక కాలంలో అన్ని భాషలలోనూ విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. భరత్ హీరోగా నటించిన ఇందులో ఆయనకు జంటగా నమిత, ఇనియ, సృష్టిడాంగే హీరోయిన్లుగా నటించారు. తంబి రామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్‌రాం, శాయాజీషిండే, మన్సూర్‌అలీఖాన్, ఆర్యన్, స్వామినాధన్, పావాలక్ష్మణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అమ్రేష్ సంగీతాన్ని, ఇనియన్ హరీష్ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడివుడైయాన్ నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment