గురువుతో మరోసారి | chit chat with hero bharath | Sakshi
Sakshi News home page

గురువుతో మరోసారి

Published Sat, Jan 25 2014 1:39 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

గురువుతో మరోసారి - Sakshi

గురువుతో మరోసారి

పాత్రలకు పరిపూర్ణంగా జీవం పోయాలని పరితపించే యువ నటుల్లో భరత్ ఒకరు. జయాపజయాలను పక్కన పెడితే ఈ యువ నటుడి చిత్రాలు నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు.

 పాత్రలకు పరిపూర్ణంగా జీవం పోయాలని పరితపించే యువ నటుల్లో భరత్ ఒకరు. జయాపజయాలను పక్కన పెడితే ఈ యువ నటుడి చిత్రాలు నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. భరత్‌కు కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి వ్యాపారం ఉంటుంది. ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా రంగ ప్రవేశం చేసిన ఈ బాయ్స్ హీరో తాజాగా మాలీవుడ్‌లో కూడా తెరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా భరత్‌తో చిన్న భేటి.....
 
 ప్ర: మీ సినీ కెరీర్‌లో తొలి బిగ్ బ్రేక్ చిత్రం ఏది?
 జ: 16 ఏళ్ల వయసులోనే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అదృష్టాన్ని అందుకున్న నటుడిని నేను. చాలామంది యువ నటుల కల అయిన అది నాకు ఆదిలోనే నెరవేరింది. ఇక నాకు తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం కాదల్.
 
 ప్ర: మీ జీవితంలో మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా?
 జ: సినిమానే ఒక విచిత్రం. ఈ పరిశ్రమలో ఎన్నో మరపురాని సంఘటనలను చవి చూస్తాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేము. అంతం లేని వింత సినిమా పరిశ్రమ.
 
 ప్ర: మీరు ఇష్టపడే హాలిడే ప్రదేశం?
 జ : స్విట్జర్లాండ్. నేనెంతగానో ఇష్టపడి వెళ్లే హాలిడే ప్రదేశం ఇది.
 
 ప్ర: ఫలాన దర్శకుడితో పని చేయాలనే కోరిక ఉందా?
 జ : చాలామంది దర్శకులతో పనిచేయాలనుంది. ముఖ్యంగా మరోసారి గ్రేట్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరిక బలీయంగా ఉంది. నేనిప్పటికీ బాయ్స్ చిత్రం సహా 25 చిత్రాలు చేశాను. ఈ సందర్భంగా నా గురువు అయిన శంకర్‌తో పని చేయాలనుకుంటున్నాను. అలాగే దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉంది.
 
 ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
 జ : మలయాళంలో కూతర అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్ర చేయడం విశేషం. తమిళంలో సెంథిల్‌కుమార్, రవి దర్శకత్వంలో నటిం చనున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement