‘సుల్తాన్, టైగర్ జిందా హై’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘భారత్’. 2014లో వచ్చిన కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి ఇది రీమేక్. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ దిశా పాట్నీ ట్రాపెజ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. సల్మాన్, ప్రియాంక ఐదు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే.
సునీల్ గ్రోవర్, టబు కీలక పాత్రల్లో నటించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఆదివారం మొదలైంది. అంటే.. ‘భారత్’ సినిమాలో సల్మాన్ జర్నీ స్టార్ట్ అయ్యిందన్నమాట. ప్రస్తుతం సల్మాన్, దిశా పాట్నీ, సునీల్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఆగస్టులో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్‌లో ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటార ని సమాచారం. సౌత్ కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సే యంగ్ ఓహ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది రంజాన్‌కు ‘భారత్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment