న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచీలో భారత్ ఒక స్థానం మెరుగుపరచుకుని 130వ ర్యాంకు సాధించింది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో 189 దేశాలకు ర్యాంకులు ప్రకటించింది. తాజా ర్యాంకింగ్‌లో పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరసగా 136, 150వ స్థానాల్లో నిలిచాయి. నార్వే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాడ్, జర్మనీ వరసగా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. 189 దేశాల్లో 59 దేశాలు అధిక మానవాభివృద్ధి గ్రూప్‌లో, 38 దేశాలు అల్ప మానవాభివృద్ధి గ్రూప్‌లో ఉన్నాయి. 0.640 హెచ్‌డీఐ స్కోర్‌తో భారత్ మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment